Wife: భార్య మీద డౌట్, యువకుడితో గంటలు గంటలు, ఫోన్ పంచాయితీ, కూతురితో కలిసి తల్లి !

బెంగళూరు/బెళగావి: చిన్న వయసులో యువతి కుటుంబ సభ్యులు ఆమెకు ఓ యువకుడితో పెళ్లి జరిపించారు. పెళ్లి చేసుకుని భర్త ఇంటికి వెళ్లిన భార్య అతనితో కొంతకాలం సంతోషంగా కాపురం చేసింది. దంపతులకు కూతురు పుట్టింది. పాప పుట్టిన తరువాత దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. భార్య నిత్యం వేరే యువకుడితో ఫోన్ లో మాట్లాడుతోందని, అతనితో క్లోజ్ గా ఉంటోందని ఆమె భర్త గమనించాడు. ఇదే విషయంలో రచ్చరచ్చ అయ్యింది. భార్య తల్లిదండ్రులు పెద్దల ముందు పంచాయితీ పెట్టారు. అసలే తాగుబోతు అయిన భర్త మీ కూతురిని సక్రమంగా అదుపులో పెట్టుకోండి అంటూ పెద్దల పంచాయితీలో తేల్చి చెప్పాడు. తాను కొన్ని రోజులు పుట్టింటికి వెళ్లి వస్తానని భార్య ఆమె కూతురితో కలిసి ఇంటి నుంచి వెళ్లింది. కూతురితో పాటు బావిలో దూకిన తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు.

 చిన్న వయసులో పెళ్లి చేశారు

చిన్న వయసులో పెళ్లి చేశారు

కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని అథణి తాలుకాలోని బాళిగేరి గ్రామంలో సవితా (26) అనే యువతి నివాసం ఉంటున్నది. చిన్న వయసులో సవితా కుటుంబ సభ్యులు ఆమెకు రాజేష్ అనే యువకుడితో పెళ్లి జరిపించారు. పెళ్లి చేసుకుని భర్త రాజేష్ ఇంటికి వెళ్లిన సవితా ఆమె భర్తతో కొంతకాలం సంతోషంగా కాపురం చేసింది.

 యువకుడితో క్లోజ్ గా ఉంటున్న భార్య !

యువకుడితో క్లోజ్ గా ఉంటున్న భార్య !

రాజేష్, సవితా దంపతులకు పవిత్రా (8) అనే కూతురు ఉంది. కూతురు పుట్టిన తరువాత రాజేష్, సవితా దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. భార్య సవితా నిత్యం వేరే యువకుడితో ఫోన్ లో మాట్లాడుతోందని, అతనితో క్లోజ్ గా ఉంటోందని ఆమె భర్త రాజేష్ కొంతకాలం నుంచి గమనిస్తున్నాడు. ఇదే విషయంలో రాజేష్, సవితా దంపతుల మద్య రచ్చరచ్చ అయ్యింది.

 మద్యం మత్తులో భార్యకు సినిమా చూపిస్తున్న భర్త

మద్యం మత్తులో భార్యకు సినిమా చూపిస్తున్న భర్త

రోజూ మద్యం సేవిస్తున్న రాజేష్ రాత్రి పూట ఇంటికి వెళ్లి నువ్వు ఎందుకు వాడితో గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుతున్నావు, వాడికి నీకు ఏమిటి సంబంధం అటూ అతని భార్య సవితాను పట్టుకుని చితకబాదుతున్నాడు. కొంతకాలం నుంచి సవితా, రాజేష్ దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. సవితా ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పింది

 కూతురిని కంట్రోల్ లో పెట్టుకోవాలని చెప్పిన భర్త

కూతురిని కంట్రోల్ లో పెట్టుకోవాలని చెప్పిన భర్త

సవితా తల్లిదండ్రులు, బంధువులు పెద్దల ముందు పంచాయితీ పెట్టారు. అసలే తాగుబోతు అయిన రాజేష్ మీ కూతురు సవితాను సక్రమంగా అదుపులో పెట్టుకోండి అంటూ పెద్దల పంచాయితీలో తేల్చి చెప్పాడు. తన గురించి తన భర్త పంచాయితీలో అందరికి చెప్పాడని, తన పరువు పోయిందని సవితా ఆవేదన చెందిందని తెలిసింది.

 కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి

కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి

తాను కొన్ని రోజులు పుట్టింటికి వెళ్లి వస్తానని సవితా ఆమె కూతురు పవిత్రాతో కలిసి ఇంటి నుంచి వెళ్లింది. కూతురు పవిత్రాతో పాటు వెళ్లిన సవితా అథణి సమీపంలోని ఓ రైతు పొలంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లీ కూతుర్ల శవాలు బావిలో తేలుతున్న విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సవితా, ఆమె కూతురు పవిత్రాతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు. పోలీసులు సవితా భర్తను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+