Wife: విదేశీ మొగుడు, విదేశీ ప్రియుడు, నర్సు జల్సాలు, ప్రియురాలి ఇంట్లోనే ప్రియుడు, క్లైమాక్స్ లో !
బెంగళూరు: విదేశాల నుంచి అక్రమంగా భారత్ చేరుకున్న వ్యక్తి తరువాత ఐటీ హబ్ చేరుకుని వ్యాపారం చేస్తున్నాడు. నర్సుతో లవ్ లో పడిన విదేశీయుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. విదేశీయుడికి అతని మాతృదేశానికి చెందిన ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ఓకే దేశానికి చెందిన వాడు కావడంతో ఆ యువకుడిని అతని ఇంటి ఎదురుగా మరో ఇంటిని అద్దెకు తీసిచ్చాడు. స్నేహితుడి భార్యతో చనువు పెంచుకున్న యువకుడు ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మ్యాటర్ తెలుసుకున్న భర్త వేరే ప్రాంతానికి కాపురం మార్చేశాడు. అయితే నర్సు విదేశీ ప్రియుడితో తిరుగుతూ ఎంజాయ్ చేసింది. భార్య దెబ్బతో భర్త వేరే రాష్ట్రానికి వెళ్లిపోవాలని భర్త అతని ఇంటిలోని వస్తువులు మొత్తం ప్యాక్ చేశాడు. ప్రియుడు వెళ్లి మీరు ఇక్కడి నుంచి వెళ్లడానికి వీలు లేదు అని గొడవ చేశాడు. సహనం కోల్పోయిన భర్త అతని భార్య ప్రియుడిని కత్తితో పొడిచి స్పాట్ లో చంపేసి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.

నైజీరియా టూ బెంగళూరు
నైజీరియా దేశానికి చెందిన ఒబినో విక్టర్ అలియాస్ విక్టర్ (35) అనే వ్యక్తి 2017లో నేపాల్ చేరుకున్నాడు. నేపాల్ లో నకిలి పాస్ పోర్ట్ తయారు చేయించుకున్న విక్టర్ తరువాత అక్రమంగా భారత్ లోకి ప్రవేశించాడు. తరువాత బెంగళూరు చేరుకున్న విక్టర్ ఇక్కడే బట్టల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

నర్సుతో లవ్ మ్యారేజ్
మేఘాలయాకు చెందిన జెన్సీ అనే యువతి బెంగళూరు చేరుకుని ప్రముఖ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. నైజీరియా విక్టర్ కు, మేఘాలయా జెన్నీకి పరిచయం అయ్యింది. తరువాత జెన్నీ, విక్టర్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. జెన్నీ, విక్టర్ దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు.

ఫ్రెండ్ కు ఎదురుగా ఇల్లు తీసిచ్చాడు
జెన్నీ, విక్టర్ దంపతులు బెంగళూరులోని కొడిగేహళ్లిలో నివాసం ఉంటున్నారు. నైజీరియాకు చెందిన సోలోమాన్ (34) అనే వ్యక్తి బెంగళూరు చేరుకుని నివాసం ఉంటున్నాడు. గత సంవత్సరం సోలోమాన్, విక్టర్ కు పరిచయం అయ్యింది. కొన్ని నెలల పాటు విక్టర్, సోలోమాన్ కలిసి తిరిగారు. తరువాత విక్టర్ అతను నివాసం ఉంటున్న కోడిగేహళ్లిలోని ఇంటి ఎదురుగా ఓ ఇంటిని సోలోమాన్ కు అద్దెకు తీసిచ్చాడు.

ఫ్రెండ్ భార్యతో రొమాన్స్
ఎదురింటిలో ఉంటున్న సోలోమాన్ అతని ఫ్రెండ్ విక్టర్ భార్య జెన్నీతో పరిచయం పెంచుకున్నాడు. స్నేహితుడు విక్టర్ భార్య జెన్నీతో చనువు పెంచుకున్న సోలోమాన్ ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. విక్టర్ బయటకు వెళ్లిన తరువాత సోలోమాన్ అతని ఇంటికి వెళ్లి అతని భార్య జెన్నీతో జల్సాలు చేస్తున్నాడు.

ఇల్లు మార్చినా భార్య పద్దతి మారలేదు
కొన్ని నెలల క్రితం భార్య జెన్నీ అక్రమ సంబంధం మ్యాటర్ తెలుసుకున్న విక్టర్ కోడిగేహళ్లి నుంచి అమృతహళ్లిలోని కెంపణ్ణ లేఔట్ ప్రాంతానికి కాపురం మార్చేశాడు. అయితే నర్సు జెన్నీ ఆమె భర్త ఫ్రెండ్ సోలోమాన్ తో తిరుగుతూ ఎంజాయ్ చేసింది. భార్య జెన్నీ దెబ్బతో విక్టర్ ముంబాయి వెళ్లిపోవాలని మంగళవారం అతని ఇంటిలోని వస్తువులు మొత్తం ప్యాక్ చేశాడు.

నీ భార్య నాకు కావాలి... మీరు ఇక్కడే ఉండాలి.... అంతే
తన భర్త విక్టర్ తనను ముంబాయి పిలుచుకుని వెళ్లిపోతున్నాడని, నువ్వు వెంటనే రావాలని జెన్నీ ఆమె ప్రియుడు సోలోమాన్ కు ఫోన్ చేసి చెప్పి ఇంటి లోకేషన్ పంపించింది. ఫ్రెండ్ విక్టర్ ఇంటి దగ్గరకు వెళ్లిన సోలోమాన్ మీరు ముంబాయి వెళ్లడానికి వీలులేదని, నాకు నీ భార్య జెన్నీ కావాలని, మీరు ఇక్కడే ఉండాలని పెద్ద గొడవ చేశాడు.

స్పాట్ లో చంపేసి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు
ఆ సందర్బంలో విక్టర్, సోలోమాన్ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడంతో ఇద్దరికి గాయాలైనాయి. సహనం కోల్పోయిన విక్టర్ అతని భార్య జెన్నీ ప్రియుడు సోలోమాన్ కత్తితో పొడిచేశాడు. పారిపోవడానికి ప్రయత్నించిన సోలోమాన్ ఇంటి మేడ మీద మెట్ల మీదపడి స్పాట్ లో చనిపోయాడు. భార్య ప్రియుడు సోలోమాన్ ను చంపేసిన విక్టర్ నేరుగా అమృతహళ్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.

హంతకుడిని వదిలేసిన పోలీసులు
నేను నా ఫ్రెండ్ ను చంపేశానని విక్టర్ పోలీసులకు చెప్పాడు. విక్టర్ బాష అర్థం కాకపోవడంతో నువ్వు ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని రావాలని పంపించేశారు. ఇంటికి వెళ్లిన విక్టర్ అతని భార్యను చితకబాదేశాడు. సోలోమాన్ హత్యకు గురైనాడని తెలుసుకున్న స్థానికులు పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చారు.

నాలుక కొరుక్కున్న పోలీసులు
పోలీసులు వెళ్లి చేస్తే ఇంతు ముందు పోలీస్ స్టేషన్ కు వచ్చిన విక్టర్ హంతకుడు అని తెలుసుకుని నాలుక కరుచుకున్నారు. నా భార్యతో సోలోమాన్ అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేశాడని, అందుకే చంపేశానని విక్టర్ అంగీకరించాడని అమృతహళ్లి పోలీసులు తెలిపారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications