యూపీలో అంతే: బొమ్మ తుపాకులతో కాదు.. అసలు సిసలు గన్ తో దీపావళి..!

లక్నో: దీపావళి పండుగ సందర్భంగా ఎవ్వరైనా బొమ్మ తుపాకులతో టపాసులు కాలుస్తుంటారు. ఓ మహిళ మాత్రం దీనికి భిన్నంగా అసలు సిసలు రివాల్వర్ ను ఉపయోగించారు. లైసెన్స్ ఉన్న గన్ తో గాల్లోకి కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో తమ కంట్లో పండగానే.. పోలీసులు రంగ ప్రదేశం చేశారు. సుమోటోగా కేసును నమోదు చేశారు. ఆ మహిళ గురించి ఆరా తీస్తున్నారు. బరేలికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అజయ్ మెహతా భార్యగా ప్రాథమికంగా నిర్ధారించారు.

బరేలిలోని ఇజ్జత్ నగర్ లో నివసించే అజయ్ మెహతా సోమవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో దీపావళి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. అయినప్పటికీ.. సంతృప్తి కలగలేదేమో. ఆయన భార్య ఇంట్లో లైసెన్స్డ్ రివాల్వర్ తో గాల్లోకి కాల్పులు జరిపారు. సుమారు మూడు రౌండ్ల పాటు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటనతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్లలోకి పరుగులు తీశారు. ఈ తతంగాన్ని స్థానికులు తమ సెల్ ఫోన్ల ద్వారా బంధించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Wife of Businessman of Uttar Pradesh, Fire In Air On Diwali, Police launched Investigation

ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి చేరింది. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేశారు. దీనిపై ప్రాథమికంగా దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఉదయం పోలీసులు అజయ్ మెహతాను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనను ప్రశ్నించగా.. తాము బొమ్మ తుపాకిని మాత్రమే వినియోగించినట్లు మొదట్లో బుకాయించాడని, అనంతరం తన తప్పును అంగీకరించాడని చెప్పారు. రివాల్వర్ కు లైసెన్స్ ఉంటే.. దాన్ని రద్దు చేస్తామని ఇజ్జత్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ కేకే వర్మ అన్నారు. లైసెన్స్ ఉన్న రివాల్వర్ ను ఇష్టానుసారంగా వినియోగించే అధికారం ఎవరికీ లేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+