Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: భర్తను ఇంటి వెనుక సజీవంగా పూడ్చి పెట్టిన ఆంటీ, టెక్కీ కూతురు నిలదీస్తే మ్యాటర్ లీక్, ఏం జరిగింది !

చెన్నై: సంతోషంగా దంపతులు జీవిస్తున్నారని అందరూ అనుకున్నారు. దంపతుల కుమార్తె ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. వారం రోజుల క్రితం ఉద్యోగం పని మీద కూతురు బయట ఊరికి వెళ్లింది. దంపతులు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. కొన్ని రోజుల తరువాత ఇంటికి తిరిగి వెళ్లిన కూతురు తన తండ్రి ఎక్కడ అని తల్లిని ప్రశ్నించింది. మీ నాన్న దేవాలయాల్లో పూజలు చెయ్యడానికి వెళ్లాడని తల్లి చెప్పింది. అయితే తల్లి తీరుతో ఆమె కూతురుకి అనుమానం వచ్చింది. తన తండ్రి ఎక్కడికి వెళ్లాడు ?, ఆయన్ను ఏమి చేశావు ? అంటూ కూతురు నిలదీసింది. మీ నాన్నను ఇంటి వెనుక పెరట్లో సజీవంగా పూడ్చి పెట్టానని తల్లి చెప్పడంతో కూతురు షాక్ అయ్యింది. పోలీసులు రంగంలోకి దిగి ఇంటి వెనుక పూడ్చి పెట్టిన వ్యక్తి శవం బయటకు తియ్యడం కలకలం రేపింది. ఇంట్లో కూతురు లేని సమయంలో భర్తను అతని భార్య ఇంటి వెనుకే పూడ్చి పెట్టడం అనేక అనుమానాలకు దారితీసింది.

సంతోషంగా ఉంటున్నారని అనుకున్నారు

సంతోషంగా ఉంటున్నారని అనుకున్నారు

చెన్నైలోని పెరుంబాక్కంలోని కలైంజర్ కరుణానిధి నగర్ లో నాగరాజ్ (59), లక్ష్మి (50) దంపతలు నివాసం ఉంటున్నారు. చాలా సంవత్సరాల నుంచి నాగరాజ్, లక్ష్మి దంపతులు అక్కడే నివాసం ఉంటున్నారు. సంతోషంగా నాగరాజ్, లక్ష్మి దంపతులు జీవిస్తున్నారని అందరూ అనుకున్నారు. నాగరాజ్, లక్ష్మి దంపతుల కుమార్తె ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది.

 వారం ముందు బయటకు వెళ్లిన కూతురు

వారం ముందు బయటకు వెళ్లిన కూతురు

వారం రోజుల క్రితం ఉద్యోగం పని మీద కూతురు బయట ఊరికి వెళ్లింది. నాగరాజ్, లక్ష్మి దంపతులు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. కూతురు క్యాంపుకు వెళ్లిన తరువాత రెండు మూడు రోజులు నాగరాజ్ ఇంటి బయట తిరుగుతున్న విషయం స్థానికులు గుర్తించారు. తరువాత నాగరాజ్ కనపడలేదని స్థానికులు అంటున్నారు.

ఇంటి వెనుక భర్తను సజీవంగా పూడ్చి పెట్టిన భార్య

ఇంటి వెనుక భర్తను సజీవంగా పూడ్చి పెట్టిన భార్య

నాుగు రోజుల క్రితం లక్ష్మి ఇద్దరు వ్యక్తులను ఇంటికి పిలిచి ఇంటి వెను పెరట్లో వాటర్ సంపు నిర్మించడానికి గోతి తీసి పెట్టాలని చెప్పింది. ఆ ఇద్దరు వ్యక్తులు ఇంటి వెనుక గోతి తీసి వెళ్లిపోయారు. తరువాత భర్త నాగరాజ్ ను అతని భార్య లక్ష్మి ఇంటి వెనుక నీటి సంపు కోసం తీసిన అదే గోతిలో సజీవంగా పూడ్చి పెట్టిందని సమాచారం.

 కూతురికి అనుమానం రావడంతో అసలు మ్యాటర్ లీక్

కూతురికి అనుమానం రావడంతో అసలు మ్యాటర్ లీక్

కొన్ని రోజుల తరువాత ఇంటికి తిరిగి వెళ్లిన కూతురు తన తండ్రి నాగరాజ్ ఎక్కడ అని ఆమె తల్లిని ప్రశ్నించింది. మీ నాన్న దేవాలయాల్లో పూజలు చెయ్యడానికి వెళ్లాడని లక్ష్మి ఆమె కూతురికి చెప్పింది. అయితే తల్లి లక్ష్మి తీరుతో ఆమె కూతురుకి అనుమానం వచ్చింది. తన తండ్రి నాగరాజ్ ఎక్కడికి వెళ్లాడు ?, ఆయన్ను ఏమి చేశావు ? అంటూ కూతురు నిలదీసింది. మీ నాన్నను ఇంటి వెనుక పెరట్లో సజీవంగా పూడ్చి పెట్టానని లక్ష్మి చెప్పడంతో ఆమె కూతురు షాక్ అయ్యింది.

నా భర్త చెప్పాడు..... నేనే పాటించాను

నా భర్త చెప్పాడు..... నేనే పాటించాను

పోలీసులు రంగంలోకి దిగి ఇంటి వెనుక పూడ్చి పెట్టిన నాగరాజ్ శవం బయటకు తియ్యడం కలకలం రేపింది. నేను దేవుడితో సమానమని, తనను సజీవంగా పూడ్చి పెడితో తనకు అనేక శక్తులు వస్తాయని, వాటి వలన మీరు సంతోషంగా ఉంటారని, నువ్వు ఆ పని చెయ్యాలని తన భర్త నాగరాజ్ చెప్పాడని, అందుకే ఇంటి వెను పూడ్చి పెట్టానని లక్ష్మి పోలీసులకు చెప్పింది.

మూడనమ్మకాలతో ఆంటీ ఇలా చేసిందా ?

మూడనమ్మకాలతో ఆంటీ ఇలా చేసిందా ?

ఇంట్లో కూతురు లేని సమయంలో భర్త నాగరాజ్ ను అతని భార్య లక్ష్మి ఇంటి వెనుకే అతన్ని సజీవంగా పూడ్చి పెట్టడం అనేక అనుమానాలకు దారితీసింది. నాగరాజ్ కొన్ని సంవత్సరాల నుంచి అనేక దేవాలయాలు తిరుగుతూ అక్కడే కాలం గడుపుతున్నాడని, తనకు అతీత శక్తులు ఉన్నాయని చెప్పి భార్య లక్ష్మి, ఆమె కూతురిని ఇంటి వెనుకకు పిలుచుకుని వెళ్లి ఇక్కడ అది చెయ్యాలి, ఇది చెయ్యాలని చాలా చెప్పాడని పోలీసులు అంటున్నారు. అయితే నాగరాజ్ ను సజీవంగా పూడ్చి పెట్టారు అని పోస్టుమార్టంలో వెలుగు చూస్తే లక్ష్మి మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తామని చెన్నై సిటీ పోలీసు అధికారులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+