Wife: లవ్ మ్యారేజ్, నలుగురు పిల్లలు, చిన్నచిన్న గొడవలు, భర్తను బెదిరించాలని భార్య ఏం చేసిందంటే !
బెంగళూరు/రామనగర్: కొన్ని సంవత్సరాలు యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ప్రేమికులు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. కష్టపడి పని చేస్తున్న భర్త అతని భార్య, పిల్లలను పోషిస్తున్నాడు. కొంతకాలంగా దంపతుల చిన్నచిన్న విషయాలకు గొడవలు జరుగుతున్నాయి. పెద్దలు, బంధువులు రాజీ చేస్తూ వాళ్లను ఒక్కటి చేస్తున్నారు. రెండు నెలల క్రితం భార్య నాలుగవ బిడ్డకు జన్మనిశ్చింది. పెద్ద కుమారుడితో కలిసి తండ్రి ప్రముఖ పుణ్యక్షేత్రానికి వెళ్లి పూజలు చేసి ఇంటికి వెళ్లాడు. తరువాత దంపతుల మద్య చిన్న విషయంలో గొడవ జరిగింది. నిత్యం ఉండే గొడవలే కదా అంటూ భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. భర్త బయటకు వెళ్లిన వెంటనే భర్తను బెదిరించాలని అతని భార్య బెడ్ రూమ్ లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాల్ లో ఆమె రెండు నెలల పసిబిడ్డ తల్లి పాల కోసం కేకలు వేస్తుండటంతో చుట్టుపక్కల వాళ్లు వెళ్లి చూడగా ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. మహిళ ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అనే అసలు విషయం తెలుసుకున్న బంధువులు, పోలీసులు షాక్ అయ్యారు.

లవ్ మ్యారేజ్
కర్ణాటకలోని రామనగర జిల్లాలోని రామగనరలో శివనంజ అలియాస్ శివ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మండ్య జిల్లాలోని మద్దూరు సమీపంలోని కోప్ప గ్రామంలో నివాసం ఉంటున్న శ్వేతా కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ప్రేమించుకున్నారు. 8 సంవత్సరాల క్రితం శివనంజ, శ్వేతా ప్రేమ వివాహం చేసుకున్నారు.

నలుగురు పిల్లలు
శివనంజ, శ్వేతా దంపతులు రామనగరలోని రాయరదోడ్డి ఏరియాలో అద్దె ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నారు. శివనంజ, శ్వేతా దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. రెండు నెలల క్రితం శ్వేతా నాలుగవ బిడ్డకు జన్మనిశ్చింది. పసిపాపను చూసుకుంటూ శ్వేతా ఇంట్లోనే ఉంటున్నది. ఇద్దరు పిల్లలు శ్వేతా పుట్టింటి దగ్గర ఉన్నారు.

చిన్నిచిన్న విషయాలకు గొడవలు
బేకరిలో కష్టపడి పని చేస్తున్న శివనంజ అతని భార్య శ్వేతా, అతని పిల్లలను పోషిస్తున్నాడు. కొంతకాలంగా శివనంజ, శ్వేతా దంపతుల చిన్నచిన్న విషయాలకు గొడవలు జరుగుతున్నాయి. పెద్దలు, బంధువులు శివనంజ, శ్వేతా దంపతులకు ఇంతకాలం రాజీ చేస్తూ వాళ్లను ఒక్కటి చేస్తున్నారు.

దేవాలయానికి వెళ్లిన భర్త
శివనంజ అతని పెద్ద కుమారుడితో కలిసి మంగళవారం ఉదయం ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన మలే మహదేశ్వర బెట్ట దేవాలయానికి వెళ్లి పూజ చేయించుకుకి ఇంటికి వెళ్లారు. తరువాత శ్వేతా గుడి నుంచి ప్రసాదం తీసుకు వచ్చావా అంటూ ఆమె భర్త శివనంజను అడిగింది. గుడి నుంచి ప్రసాదం తీసుకురాలేదని శివనంజ అతని భార్య శ్వేతాకు చెప్పాడు.

ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న భార్య
తరువాత శివనంజ, శ్వేతా దంపతుల మద్య ప్రసాదం తీసుకురాలేదనే విషయంలో గొడవ జరిగింది. నిత్యం ఉండే గొడవలే కదా అంటూ శివనంజ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. భర్త శివనంజ ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే అతని భార్య శ్వేతా బెడ్ రూమ్ లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Recommended Video


తల్లిపాల కోసం ఏడ్చిన పసిబిడ్డ
హాల్ లో శ్వేతా రెండు నెలల పసిబిడ్డ తల్లి పాల కోసం ఏడుస్తున్న విషయం గమనించిన చుట్టుపక్కల వాళ్లు ఇంట్లోకి వెళ్లి చూడగా ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. శ్వేతా గుడిలో నుంచి ప్రసాదం తీసుకురాలేదని ఆత్మహత్య చేసుకుంది అనే అసలు విషయం తెలుసుకున్న బంధువులు, పోలీసులు షాక్ అయ్యారు.












Click it and Unblock the Notifications