Wife: కోర్టు కాంపౌండ్ లో భార్య కాలు నరికేసిన మాజీ సైనికుడు, అప్పటి నుంచి అదే గొడవలు, చివరికి !

బెంగళూరు/ బెళగావి: మాజీ సైనికుడు, అతని భార్య మద్య గొడవలు జరుగుతున్నాయి. దంపతుల మద్య రాజీ చెయ్యడానికి వారి కుటుంబ సభ్యలు అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. చివరికి దంపతులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు చుట్టూ తిరుగుతున్న దంపతుల మద్య ఇంకా ఒకరి మీద ఒకరికి కోపం ఎక్కువ అయ్యింది. కోర్టు విచారణకు భార్య, ఆమె భర్త ఇద్దరూ హాజరైనారు. కోర్టు విచారణ పూర్తి అయిన తరువాత దంపతులు ఎవరిపాటికి వారు బయలుదేరారు. అయితే కోర్టు ఆవరణంలోనే భర్త అతని బ్యాగ్ లోని పదునైన కొడవలి తీసుకుని అతని భార్య మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. భార్య తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మాజీ సైనికుడైన ఆమె కాలు మీద మూడుసార్లు కాలు మీద నరికేయడం కలకలం రేపింది.

11 సంవత్సరాల క్రితం వివాహం

11 సంవత్సరాల క్రితం వివాహం

కర్ణాటకలోని బెళగావి జిల్లా బైలమంగళకు చెందిన శివప్ప భారత సైన్యంలో ఉద్యోగం చేసేవాడు. 11 సంవత్సరాల క్రితం ధారవాడ జిల్లా హుబ్బళాలి తాలుకాలోని వరూర్ గ్రామానికి చెందిన జయమాలా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. సైన్యంలో ఉద్యోగం చేస్తూనే శివప్ప సెలవులో వచ్చి భార్య జయమాలాతో సంతోషంగా కాపురం చేసి వెళ్లేవాడు.

 దంపతుల మద్య తేడాలు

దంపతుల మద్య తేడాలు

సైన్యంలో ఉద్యోగం చేసే సమయంలో శివప్ప అతని భార్య జయమాలా అడిగినప్పుడు ఎంతపడితే అంత డబ్బులు ఇచ్చేవాడని సమాచారం. ఉద్యోగం చేస్తున్న సమయంలో సంపాధించిన డబ్బులు మొత్తం శివప్ప అతని భార్య జయమాలాకు ఇచ్చాడని సమాచారం. ఇదే విషయంలో శివప్ప, జయమాల దంపతుల మద్య తేడాలు వచ్చాయి తెలిసింది.

రిటైడ్ మాజీ పైనికుడి ఇంట్లో పంచాయితీలు

రిటైడ్ మాజీ పైనికుడి ఇంట్లో పంచాయితీలు

శివప్ప ఉద్యోగం నుంచి రిటైడ్ అయ్యాడు. తరువాత శివప్ప, జయమాల దంపతుల మద్య గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయి. మాజీ సైనికుడు శివప్ప, అతని భార్య జయమాల మద్య గొడవలు చాలా కాలం జరిగాయి. శివప్ప, జయమాల దంపతుల మద్య రాజీ చెయ్యడానికి వారి కుటుంబ సభ్యలు అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు.

కోర్టును ఆశ్రయించిన దంపతులు

కోర్టును ఆశ్రయించిన దంపతులు

చివరికి శివప్ప, జయమాల దంపతులు కోర్టును ఆశ్రయించారు. బెళగావి జిల్లాలోని బైలహోంగల కోర్టు చుట్టూ తిరుగుతున్న శివప్ప, జయమాల దంపతుల మద్య ఇంకా ఒకరి మీద ఒకరికి కోపం ఎక్కువ అయ్యింది. కోర్టు విచారణకు శివప్ప, జయమాల ఇద్దరూ హాజరైనారు. కోర్టు విచారణ పూర్తి అయిన తరువాత శివప్ప, జయమాల దంపతులు ఎవరిపాటికి వారు బయలుదేరారు.

కోర్టు ఆవరణంలో భార్య కాలు నరికేసిన భర్త

కోర్టు ఆవరణంలో భార్య కాలు నరికేసిన భర్త

బైలహోంగల కోర్టు ఆవరణంలోనే బయటకు వెలుతున్న భర్త జయమాలను అడ్డగించింన ఆమె భర్త శివప్ప అతని బ్యాగ్ లోని పదునైన కొడవలి తీసుకుని అతని భార్య మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. జయమాల తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మాజీ సైనికుడు శివప్ప అతని భార్య కాలు మీద మూడుసార్లు నరికేశాడు. కోర్టు ఆవరణంలో మాజీ సైనికుడు శివప్ప రెచ్చిపోవడంతో కోర్టు ఆవరణంలో ఉన్న లాయర్లు, కోర్టు విచారణకు హాజరైన వారు భయంతో పరగులు తీశారు.

 మాజీ సైనికుడు అరెస్టు

మాజీ సైనికుడు అరెస్టు


భార్య జయమాలాను చంపేయడానికి ప్రయత్నించిన మాజీ సైనికుడు శివప్పను అదే కోర్టు ఆవరణంలో ఉన్న పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ప్రవేశద్వారంలో లోపలికి ఎవరు వస్తున్నారు, బయటకు ఎవరు వెలుతున్నారు అని సోదాలు చెయ్యడానికి ఒక్క పోలీసు కూడా లేకపోవడంతో శివప్ప దర్జాగా కోర్టు ఆవరణంలోకి బ్యాగ్ లో పదునైన కొడవలి తీసుకువచ్చాదని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+