బాత్ రూమ్ నుండి భర్త బయటకు రాగానే కొట్టి ప్రైవేట్ పార్ట్స్ ను కత్తితో కోసి తర్వాత ఇలా....

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లోని ఓ భార్య తన భర్త ప్రైవేట్ పార్ట్స్ ను కూరగాయలు కోసే కత్తితో కోసి పోలీసులకు లొంగిపోయింది. అయితే ఈ ఘటనకు కారణాలు ఏమిటో అంతుబట్టడం లేదని పోలీసులు చెబుతున్నారు.

ఘజియాబాద్:ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో ఓ భార్య తన భర్త ప్రైవేట్ పార్ట్స్ ను కూరగాయలు కోసే కత్తితో కోసి పోలీసులకు లొంగిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఘజియాబాద్ లోని వందనా ఎన్ క్లేవ్ లో ఈ ఘటన గురువారం ఉదయం చోటుచేసుకొంది. నిందితురాలిపై 326 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Wife slashes man’s private parts, surrenders to cops

బాధితుడు క్యాబ్ డ్రైవర్ గా పనిచేసేవాడు.గురువారం ఉదయం పూట ఆయన బాత్ రూమ్ లో స్నానం చేసి బయటకు రాగానే ఆయన భార్య అతనిపై దాడికి దిగింది. గ్రైండర్ లో ఉండే రాయితో అతనిపై దాడికి దిగింది.దీంతో అతను స్పృహ కోల్పోయాడు.

అతను స్పృహ కోల్పోగానే ఆమె అతని ప్రైవేట్ పార్ట్స్ ను కూరగాయలు కోసే కత్తితో కట్ చేసింది.వెంటనే అతణ్ణి ఇంట్లోనే ఉంచి తాళం వేసి ఖోడా పోలీసులకు లొంగిపోయింది.

అయితే బాధితుడిని అతని స్నేహితుడు జైపీ ఆసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే అతని పరిస్తితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. అంతేకాదు అతనికి తీవ్రంగా రక్తస్రావమైందని డాక్టర్లు చెప్పారు.ఐదు గంటల పాటు ఆయనకు శస్త్రచికిత్స చేశారు. బాధితుడు ప్రస్తుతం కోలుకొంటున్నాడని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.

ఇంతకు ఆయన భార్య భర్తపై ఎందుకు ఈ రకంగా దాడికి పాల్పడిందే విషయం మాత్రం బయటకు రాలేదు. ఈ విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. భర్తపై భార్యకు ఇంత కోపం రావడం అరుదుగా జరిగే సంఘటనగా మానసిక విశ్లేషకులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+