Wife: భార్య మీద డౌట్, పుట్టింటికి వెళ్లిన భార్య, భర్త వెళ్లి చూస్తే భార్య ?, అత్తను చంపేసి !
చెన్నై/ కాంచీపురం: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కూతుర్లు పుట్టిన తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భార్య మీద అనుమానంతో మద్యంకు బానిస అయిన భర్త రోజు లిక్కర్ తాగేసి ఇంటికి వెళ్లి భార్యను చితకబాదేస్తున్నాడు. రోజు ఇంటికి వస్తున్న భర్త చితకబాదడంతో దెబ్బలు తట్టుకోలేక భార్య ఆమె పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. భార్యను పిలుచుకుని రావడానికి భర్త అతని అత్త ఇంటికి వెళ్లాడు. పుట్టింటిలో భార్య లేకపోవడంతో రాత్రి వరకు భర్త అక్కడే ఆమె కోసం వేచి చూశాడు. ఎంతసేపటికి భార్య ఇంటికి రాకపోవడంతో భర్త రగిలిపోయాడు. నా భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే బయట తిరుగుతోందని భర్తకు ఇంకా అనుమానం పెరిగింది. ఆవేశంతో ఊగిపోయిన భర్త కత్తి తీసుకుని అతని అత్తను, బావమరిదిని పొడిచిపారేశాడు. అల్లుడి దెబ్బతో అత్త ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

దంపతుల హ్యాపీలైఫ్
చెన్నై సిటీ సమీపంలోని మడిపాక్కంలోని కోవిల్ వీధిలో ఆర్ముగం (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 17 సంవత్సరాల క్రితం అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న గీతా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న అర్ముగం, గీతా దంపతులు సంతోషంగా కాపురం చేశారు. గీతా, ఆర్ముగం దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

భార్య మీద అనుమానం
ఆర్ముగం ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నాడు. కూతుర్లు పుట్టిన తరువాత అర్ముగం, గీతా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భార్య గీతా మీద అర్ముగంకు అనుమానం మొదలైయ్యింది. ఎక్కువగా బయట తిరుగుతున్న గీతా మీద అనుమానంతో మద్యంకు బానిస అయిన అర్ముగం రోజు లిక్కర్ తాగేసి ఇంటికి వెళ్లి అతని భార్యను చితకబాదేస్తున్నాడు.

భార్య ఇంట్లో లేదని ?
రోజు ఇంటికి వస్తున్న భర్త ఆర్ముగం చితకబాదడంతో దెబ్బలు తట్టుకోలేక అతని భార్య గీతా ఆమె ఇద్దరు కూతుర్లతో కలిసి పుట్టింటికి వెళ్లింది. పుట్టింటిలో ఉంటున్న భార్య గీతా ఇంటికి వస్తుందని ఆర్ముగం మూడు వారాల నుంచి వేచిచూశాడు. చివరికి భార్య గీతాను పిలుచుకుని రావడానికి ఆర్ముగం అతని అత్త ఇంటికి వెళ్లాడు. పుట్టింటిలో భార్య గీతా లేకపోవడంతో రాత్రి ఆర్ముగం అత్తారింటి దగ్గర ఆమె కోసం వేచి చూశాడు

భార్యకు అక్రమ సంబంధం ఉందని ?
ఎంతసేపటికి భార్య గీతా ఇంటికి రాకపోవడంతో ఆర్ముగం రగిలిపోయి మళ్లీ పీకలదాక మద్యం సేవించాడు. నా భార్య గీతా అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే బయట తిరుగుతోందని ఆర్ముగంకు ఇంకా అనుమానం పెరిగింది. ఆవేశంతో ఊగిపోయిన ఆర్ముగం అతని అత్త చిత్రాతో గొడవ పెట్టుకుని కత్తి తీసుకుని అతని అత్తను పొడిచేశాడు.

అల్లుడి దెబ్బకు అత్త ప్రాణం పోయింది
అడ్డు వెళ్లిన బావమరిది ఉదయ్ కుమార్ (34)ను పొడిచిపారేశాడు.తీవ్రగాయాలైన చిత్రా, ఆమె కొడుకు ఉదయ్ కుమార్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై అత్త చిత్రా చనిపోయింది. అల్లుడు ఆర్ముగం దెబ్బతో అతని అత్త చిత్రా ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications