భర్తకు విచిత్రమైన శిక్ష విధించిన భార్య : ఫెవిక్విక్ తో..
మధ్యప్రదేశ్ : సంసారం అన్నాక.. భార్యభర్తల మధ్య గొడవలు కామనే. అయితే ఎంత పెద్ద గొడవయినా.. సాయంత్రానికి అంతా సర్దుమణిగిపోయి ఎంచక్కా కబుర్లలో మునిగిపోయేవాళ్లు కొందరైతే, జరిగిన గొడవను మనసులోనే పెట్టుకుని కక్ష సాధించాలని ప్రయత్నించేవాళ్లు కొంతమంది. అయితే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే.. ఈ గొడవలేవి ఉండకపోవచ్చు కూడా.
తాజాగా భర్త ప్రవర్తనతో విసుగు చెందిన ఓ మహిళ భర్తకు విచిత్రమైన శిక్ష విధించింది. మధ్యప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటనలో నిద్రపోతున్న భర్త కళ్లకు ఫెవిక్విక్ అంటించి అక్కడి నుంచి ఉడాయించింది భార్య. ఇంకేముంది నిద్రమత్తు వదిలినా..! ఎంతకీ సదరు భర్త గారి కళ్లు తెరుచుకోకపోవడంతో అతనికి అసలు విషయం అర్థమైంది. ఎంతకీ కళ్లు తెరుచుకోకపోవడంతో.. గట్టిగా కేకలు పెట్టసాగాడు.

దీంతో గమనించిన స్థానికులు అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతని కళ్లను పరీక్షించిన డాక్టర్లు, ఫెవిక్విక్ ను కరిగించి కళ్లు తెరిచేలా చేయాలని, అయితే ఈ క్రమంలో కళ్లు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. కాగా ఈ చర్యకు ఒడిగట్టిన భార్యపై ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు వెల్లడించారు.
బాధితుడు సంతోష్ ఒక మోటార్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని భార్య పేరు విజయలక్ష్మిగా సమాచారం. వీరిద్దరి మధ్య తరుచూ గొడవలు జరగడంతో, భర్త సంతోష్ ప్రవర్తనపై విసుగు చెందిన భార్య లక్ష్మి ఈ చర్యకు పూనుకుంది.












Click it and Unblock the Notifications