Wife: భార్యను రివాల్వర్ తో కాల్చి చంపేసి వ్యాపారి ఆత్మహత్య, కూతురి పెళ్లికి రూ. 1 కోట్లి !
భోపాల్/మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ప్రముఖ వ్యాపారి తన భార్యను రివాల్వర్ తో కాల్చి హత్య చేసి అతను ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది పోలీసులు సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను, రివాల్వర్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి మృతదేహాలపై తుపాకీ గాయాలు కనిపించగా, ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ కూడా లభ్యమైందని, దాని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు అన్నారు. తన కూతురి పెళ్లి రూ. కోటి రూపాయలు ఖర్చు చేసి గ్రాండ్ గా పెళ్లి చెయ్యాలని ఆ వ్యాపారి వీడియో తీసి మరీ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

భార్యను కాల్చి చంపేసి వ్యాపారి ఆత్మహత్య
బాగేశ్వర్ ధామ్ భక్తుడైన వ్యాపారవేత్త సంజయ్ సేఠ్ అతని భార్యను రివాల్వర్ తో కాల్చి చంపి అదే రివాల్వర్ తో కాల్చుకుని అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సంజయ్ సేఠ్ పేరు మీద సూసైడ్ నోట్ కూడా లభించింది.
ఈ సూసైడ్ నోట్‌లో గురూజీ నన్ను క్షమించు, నాకు మరో జన్మ వస్తే మీ నమ్మకమైన భక్తుడిగా మాత్రమే పుడుతాను అని రాశాడని పోలీసులు అన్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు సంజయ్ సేఠ్ అతను ఏడుస్తున్న వీడియోను కూడా రికార్డ్ చేశాడు. ఈ వీడియోలో తన వద్ద అప్పుగా డబ్బు తీసుకున్న వాళ్లు అందరూ డబ్బును తిరిగి తన కుటుంబ సభ్యులకు చెల్లించని వారి పేర్లతో సహా చెప్పాడు.

నా కూతురి పెళ్లికి రూ. 1 కోటి ఖర్చు పెట్టండి
దయచేసి నా డబ్బును నా పిల్లలకు, నా కుమార్తె వివాహం కోసం తిరిగి ఇవ్వండి. నాకూతురి పెళ్లిని రూ 50 లక్షల నుండి రూ 1 కోటి వరకు ఖర్చు పెట్టి గ్రాండ్ గా జరిపించాలని సంజయ్ సేఠ్ బంధువులకు మనవి చేశాడు. నా బ్యాంక్ ఖాతాలో చాలా డబ్బు ఉంది. ఇంట్లోని లాకర్ లో రూ. 29 లక్షల రూపాయల ఉంచాను అని కూతురికి చెప్పాడు. నా భార్య, నేను ఇద్దరం వెళ్లిపోతున్నాం, కూతురి దగ్గర చాలా నగలు ఉన్నాయి.. నా పిల్లలు, నన్ను క్షమించాలని సంజయ్ సేఠ్ ఆ వీడియోలో చెప్పాడు.
సంజయ్ సేఠ్ తన భార్య మినుతో కలిసి మధ్యప్రదేశ్‌లోని పన్నా నగర్ నడిబొడ్డున కిషోర్ గంజ్ ప్రాంతంలో నివసించాడు.

రూమ్ లో ఇద్దరు మాత్రమే ఉన్నారు
ఘటన జరిగిన సమయంలో సంజయ్, అతని భార్య ఇద్దరూ ఇంటి రెండో అంతస్తు గదిలో ఉన్నారు. తుపాకీ శబ్దాలు వినిపించడంతో కుటుంబ సభ్యులు మేడ మీదకు వెళ్లారని పోలీసులు అన్నారు. కుటుంబ సభ్యులు మేడ మీదకు వెళ్లి చూసే సరికి మహిళ అప్పటికే మృతి చెందింది. కానీ వ్యాపారవేత్త సంజయ్ సేఠ్ ఇంకా ఊపిరి పీల్చుకున్నాడు. అయితే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే సమయానికి సంజయ్ సేఠ్ కూడా మరణించాడని పోలీసులు అన్నారు.

వీడియో, డెత్ నోట్ కలకలం
ఈ ఘటనపై పన్నా పోలీస్ సూపరింటెండెంట్ ధర్మరాజ్ మీనా స్థానిక మీడదియాతో మాట్లాడుతూ కుటుంబ కలహాలతోనే సంజయ్ సేఠ్ అతని భార్యను రివాల్వర్ తో కాల్చి హత్య చేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని అన్నారు. ఇది చాలా విచారకరమైన సంఘటన, ఇందులో బయటి వ్యక్తుల ప్రమేయం కనిపించడం లేదని, ఆ గదిలో సంజయ్, అతని భార్య మాత్రమే ఉన్నారని, అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ సూపరింటెండెంట్ ధర్మరాజ్ మీనా తెలిపారు.












Click it and Unblock the Notifications