Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: మొదటి భార్య జంప్ జిలాని, రెండో భార్య కూడా ?, అత్త చెప్పిందని వెళ్లింది. క్లైమాక్స్ లో ఏం జరిగిదంటే!

క్రిష్ణగిరి/చెన్నై: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మద్య గొడవలు జరిగాయి. పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకుండా పోయింది. భర్తతో గొడవపడిన భార్య ఆమె భర్తకు టాటా చెప్పేసి బెంగళూరుకు జెండా ఎత్తేసింది. మొదటి భార్య వదిలేసిన రెండు సంవత్సరాల తరువాత భర్త మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు ఇద్దరు పిల్లలు పుట్టారు.

రెండో భార్యకు పిల్లలు పుట్టిన తరువాత ఆ భార్యతో కూడా భర్తకు గొడవలు జరిగాయి. కొంతకాలం భర్తతో గొడవపడిన భార్య ఆమె పుట్టింటికి వెళ్లింది. భర్త అనారోగ్యంతో బాధపడుతుంటే అతని తల్లి అతికష్టం మీద మాట్లాడి ఆతని రెండో భార్యను పిలుచుకుని వెళ్లింది. గొడవ పడి పుట్టింటిలో ఉంటున్న మహిళ భర్త ఆనారోగ్యంతో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్లి అతని చేతిలోనే రెండో భార్య దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది.

మొదటి భార్యతో సంతోషంగా

మొదటి భార్యతో సంతోషంగా

తమిళనాడులోని క్రిష్ణగిరి పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుత్రి ఎదురుగా ఉన్న రైల్వేకాలనీలో సుందర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. పెయింటర్ గా పని చేస్తున్న సుందర్ కు కొన్ని సంవత్సరాల క్రితం కళావతి అనే మహిళను వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న సుందర్, కళావతి దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు.

జెండా ఎత్తేసిన మొదటి భార్య

జెండా ఎత్తేసిన మొదటి భార్య

ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత సందర్, కళావతి దంపతుల మద్య గొడవలు జరిగాయి. పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవల భర్త సుందర్ తో గొడవపడిన అతని భార్య కళావతి కొంతకాలం అతితో గొడవపడుతూ వచ్చింది. భర్త సుందర్ కు టాటా చెప్పేసిన కళావతి ఆమె ఇద్దరు .పిల్లలతో కలిస బెంగళూరుకు చేరుకుంది.

రెండో భార్య కూడా జంప్

రెండో భార్య కూడా జంప్

మొదటి భార్య కళావతి వదిలేసిన రెండు సంవత్సరాల తరువాత సుందర్ లక్ష్మీ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య లక్ష్మీకి ఇద్దరు పిల్లలు పుట్టారు. రెండో భార్య లక్ష్మీకి కు పిల్లలు పుట్టిన తరువాత ఆ రెండో భార్యతో కూడా సుందర్ కు గొడవలు జరిగాయి. కొంతకాలం క్రితం భర్త సుందర్ తో గొడవపడిన అతని రెండో భార్య ఆమె పుట్టింటికి వెళ్లింది.

 అత్త మాటలు విని భర్త ఇంటికి వెళ్లిన రెండో భార్యతో?

అత్త మాటలు విని భర్త ఇంటికి వెళ్లిన రెండో భార్యతో?

సుందర్ అనారోగ్యంతో బాధపడుతుంటే అతని తల్లి అతికష్టం మీద మాట్లాడి ఆతని రెండో భార్య లక్ష్మీని పుట్టింటి నుంచి పిలుచుకుని సుందర్ ఇంటికి వెళ్లింది. గొడవ పడి పుట్టింటిలో ఉంటున్న లక్ష్మీ ఆనారోగ్యంతో ఉన్నాడని ఆమె భర్త సుందర్ కు సేవలు చెయ్యడానికి అతి ఇంటికి వెళ్లింది. ఇంటిలో సుందర్ కు, అతని రెండో భార్య లక్ష్మీకి గోడవలు జరిగాయి.

భర్త ఇంటికి వెళ్లి ఫినిష్

భర్త ఇంటికి వెళ్లి ఫినిష్

ఆ సందర్బంలో సహనం కోల్పోయిన సుందర్ కొడవలి తీసుకుని అతని రెండో భార్య లక్ష్మీని హత్య చేసి అక్కడి నుంచి తప్పించుకుని పరారైనారు, లక్ష్మీ హత్యకు గురైయ్యిందని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. భర్త సుందర్ కు సేవలు చెయ్యడానికి అతని ఇంటికి వెళ్లిన లక్ష్మీ ఆమె భర్త చేతిలోనే దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+