Wife: లవ్ మ్యారేజ్, పుట్టింటి దగ్గర ?, బెడ్ రూమ్ లో భార్య గొంతు చీల్చి చంపి చేతులు దులుపుకున్న భర్త !
చెన్నై/ తిరుప్పూర్: ప్రేమించుకున్న యువతి, యువకుడు పెళ్లి చేసుకుంటామని చెప్పడంతో వారి పెద్దలు సంతోషంగా పెళ్లి చేశారు. వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా ఉండాలని ఇరు కుటుంబ సభ్యులు దేవుడిని వేడుకున్నారు. కొన్ని నెలల నుంచి దంపతుల మద్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పదేపదే భార్య పుట్టింటికి వెళ్లి పోవడం, తరువాత భర్త బతిమిలాడి ఇంటికి పిలుచుకుని రావడం, ఇదే పంచాయితీలు జరుగుతూనే ఉన్నాయి. పెద్దలు జోక్యం చేసుకున్న సమయంలో బుద్దిమంతులు లాగా మీరు చెప్పినట్లే వింటామని భార్య, భర్త వారికి చెబుతూ వచ్చారు. మద్యలో భార్య పుట్టింటి దగ్గర జరిగిన ఓ సీన్ తో పరిస్థితులు మొత్తం రివర్స్ అయ్యాయి. బెడ్ రూమ్ లో భార్య గొంతు చీల్చి దారుణంగా చంపేసిన భర్త పీడపోయిందని చేతులు దులుపేసుకుని ఎస్కేప్ అయ్యాడు.

కొన్ని సంవత్సరాల క్రితం ?
తమిళనాడులోని తేని జిల్లాలోని బోడినాయకనూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న అరుణ్ కుమార్ (23) అనే యువకుడు తిరుప్పూర్ లో ఉంటూ బనియన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పాయలపాలెంలోని వైష్ణవి (20) అనే యువతి అరుణ్ కుమార్ ప్రేమించుకున్నారు. తరువాత ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ప్రేమికుల విషయం తెలుసుకున్న పెద్దలు వారి పెళ్లి చెయ్యాలని మాట్లాడుకున్నారు.

దంపతుల హ్యాపీలైఫ్
పెళ్లి చేసుకోవడం ఇష్టమని ప్రేమికులు ముందుగానే వారి పెద్దలకు చెప్పడంతో అరుణ్ కుమార్, వైష్ణవిల పెద్దలు చాలా సంతోషంగా పెళ్లి చేశారు. వివాహం చేసుకున్న నవ దంపతులు అరుణ్ కుమార్, వైష్ణవి సంతోషంగా ఉండాలని ఇరు కుటుంబ సభ్యులు దేవుడిని వేడుకున్నారు. వివాహం జరిగిన ఆరు నెలల పాటు అరుణ్ కుమార్, వైష్ణవి దంపతులు చాలా సంతోషంగానే ఉన్నారు.

పెద్దల జోక్యంతో బుద్దిమంతులుగా ఉన్నారు
పాండియన్ నగర్ లోని పన్నారియమ్మన్ వీధిలో అరుణ్ కుమార్, వైష్ణవి దంపతులు అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. రానురాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అరుణ్ కుమార్, వైష్ణవి దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. కొన్ని నెలల నుంచి అరుణ్ కుమార్, వైష్ణవి దంపతుల మద్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. భార్య వైష్ణవి గొడవపడి పుట్టింటికి వెళ్లి పోవడంత, తరువాత ఆమె భర్త అరుణ్ కుమార్ ఆమెను బతిమిలాడి ఇంటికి పిలుచుకుని రావడం జరుగుతోంది. అరుణ్ కుమార్, వైష్ణవి దంపతుల మద్య ఇదే పంచాయితీలు జరుగుతూనే ఉన్నాయి.

పుట్టింటికి వెళ్లి ఎంజాయ్ చేస్తున్న భార్య ?
కొన్ని రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన వైష్ణవి అక్కడే ఉంటూ ఎంజాయ్ చేసిందని తెలిసింది, అరుణ్ కుమార్ ఇంటికి రావాలని చెప్పినా ఆమె ఈరోజు వస్తాను, రేపు వస్తాను అంటూ కాలం గడిపేసింది. భార్య వైఫ్ణవి తీరుతో విసిగిపోయిన అరుణ్ కుమార్ అత్తారింటికి వెళ్లి ఆమెను బలవంతంగా ఇంటికి పిలుచుకుని వెళ్లాడని తెలిసింది.

మూడు రోజుల ముందే భార్య గొంతు కోసి చంపేసిన భర్త
మూడు రోజుల క్రితం అరుణ్ కుమార్, వైష్ణవి దంపతులు బయటకు వెళ్లి తరువాత ఇంటికి వెళ్లిన విషయం చుట్టుపక్కల వారు చూశారు. తరువాత మూడు రోజులు అయినా అరుణ్ కుమార్, వైష్ణవి దంపతులు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి వెళ్లి చూశారు. ఇంట్లో వైఫ్ణవి మంచం మీద శవమై కనిపించడంతో హడలిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్య వైష్ణవి గొంతు చీల్చి దారుణంగా చంపేసిన ఆమె భర్త అరుణ్ కుమార్ పీడపోయిందని చేతులు దులుపేసుకుని ఎస్కేప్ అయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications