Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video: బంగారం కోసం ఓ భార్య ఎంత పనిచేసిందో చూడండి..!!

ఇన్నాళ్లు ఓ లెక్క.. ఇప్పుడు ఓ లెక్క.. అన్నట్టు మారుతుంది ప్రపంచం. ఎక్కువగా మగాళ్ల ఆకృత్యాల గురించి, వారు పాల్పడుతున్న నేరాల గురించి ఎక్కువగా వార్తలు వస్తూ ఉంటాయి. ఇప్పటికీ మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ మరోవైపు మాత్రం గత కొన్నేళ్లుగా మగాళ్లపై కూడా దాడులు ఎక్కువగా జరుగుతుండడం తీవ్రచర్చకు దారి తీస్తోంది. ఇప్పుడు ఈ తరహా ఘటనే మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. భార్య, అత్తింటి వారు తనను తీవ్రంగా కొట్టి హింసిస్తున్నారని ఓ వ్య‌క్తి పోలీసుల‌ను ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎంపీలోని పన్నాకు చెందిన లోకేష్.. హరితకు 2023 జూన్ లో వివాహం జరిగింది. పేద కుటుంబానికి చెందిన హర్షిత రైక్వార్‌ను తాను ఎలాంటి కట్నం తీసుకుకోకుండా 2023 జూన్‌లో పెళ్లి చేసుకున్నట్లు లోకేశ్‌ చెబుతున్నారు. అయితే పెళ్లి తర్వాత నుంచి భార్య, అత్త, బావమరిది డబ్బులు, బంగారు నగలు కావాలని తనను డిమాండ్ చేస్తున్నారని ఆరోపించాడు. తాను ఇవ్వ‌లేన‌ని చెప్ప‌డంతో మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని, చిత్రహింసలకు గురిచేస్తున్నారని వాపోయాడు.

wife-tortured-husband-for-gold-at-madya-pradesh-and-video-got-viral

ఈ క్రమంలోనే ఇన్నాళ్లు వారి చిత్రహింసలను భరించిన లోకేష్.. నిజాన్ని బయటపెట్టడానికి ఇంట్లో సీక్రెట్ గా కెమెరాను ఏర్పాటు చేసినట్టు వెల్లడించాడు. మార్చి 20న భర్త లోకేశ్‌ను భార్య హర్షిత రైక్వార్‌ దారుణంగా కొట్టింది. అయితే త‌న‌ను కొట్టొద్ద‌ని చేతులు జోడించి వేడున్నప్పటికీ ఆమె కనికరించలేదు. మరో మహిళ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. అయినా కూడా ఆమె లోకేశ్‌ చెంపలు వాయించ‌డంతో పాటు ముఖంపై కాలితో తన్నింది. కాలర్‌ పట్టుకుని తన చెంపలపై పలుమార్లు కొట్టింది. ఈ తతంగం అంతా వీడియోలో రికార్డ్ అయ్యింది.

ఇక ఈ ఘటన తర్వాత భార్య నుంచి తనకు రక్షణ కల్పించాలని లోకేష్ పోలీసులను ఆశ్రయించాడు. త‌న‌ను తన భార్య కొడుతున్న వీడియోను పోలీసులకు అందజేశాడు. అత‌ని ఫిర్యాదు మేర‌కు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేపట్టారు. అంతే కాకుండా ఇందుకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లోకేష్ కు సపోర్ట్ చేస్తూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+