వివాహేతర సంబంధం తెలిసిందని భర్తను చంపాలనుకొంది, చివరికిలా...
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించేందుకు ఓ వివాహిత ప్రయత్నించింది. అయితే ప్రియుడు అతడి అనుచరులు దాడి చేయడంతో అతడు చనిపోయాడని బావించారు. కానీ, చివరకు బతికి బయటపడ్డాడు..
బెంగుళూరు: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించేందుకు ఓ వివాహిత ప్రయత్నించింది. అయితే ప్రియుడు అతడి అనుచరులు దాడి చేయడంతో అతడు చనిపోయాడని బావించారు. కానీ, చివరకు బతికి బయటపడ్డాడు..ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో సంచలనం కల్గించింది.
కర్ణాటకలోని బెళతూరులో గ్రామానికి చెందిన సోమశేఖర్ కు అదే గ్రామానికి చెందిన సుధతో వివాహమైంది. ఈ క్రమంలో సుధకు కొద్దికాలం క్రితం అదే ప్రాంతానికి చెందిన అరుణ్ తో పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయం కాస్త వివాహేతర సంబందానికి దారితీసింది. వీరి వ్యవహరం సుధ భర్త సోమశేఖర్ కు తెలిసింది.ఈ విషయమై భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
శుక్రవారం రాత్రి కూడ ఇదే విషయమై భార్య, భర్తల మధ్య గొడవలు జరిగాయి. తన భర్తను హత్యచేయాలంటూ సుధ ప్రియుడు అరుణ్ కు సూచించింది.
శుక్రవారం నాడు రాత్రి పనిపై బయటకు వచ్చిన సోమశేఖర్ పై తన అనుచరులతో కలిసి అరుణ్ ఇనుపరాడ్లు , కత్తులతో దాడి చేశాడు. దీంతో సోమశేఖఱ్ స్పృహతప్పిపోయాడు.
సోమశేఖర్ మరణించాడని భావించిన నిందితులు అక్కడి నుండి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు సోమశేఖర్ ను కెఆర్ పురం ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications