అక్రమ సంబంధం, భర్త హత్యకు భార్య పక్కాప్లాన్, ప్రియుడితో కలిసి కదులుతున్న రైలు నుంచి తోసేసి!

చెన్నై: అక్రమ సంబంధం కారణంగా ప్రియుడు, అతని స్నేహితుల సహాయంతో భర్తను హత్య చేయించడానికి భార్య విఫలయత్నం చేసింది. నిందితులు కదులుతున్న రైలు నుంచి భర్తను కిందకు తోసివేసి హత్య చెయ్యడానికి ప్రయత్నించడంతో గాయాలైన అతను పోలీసులను ఆశ్రయించాడు. తన ప్రియుడు, కిరాయి హంతకులతో తన భర్తను హత్య చేయిండానికి తానే పక్కాప్లాన్ వేశానని భార్య అంగీకరించింది. తన భార్య, ఆమె ప్రియుడిని కఠినంగా శిక్షించాలని భర్త పోలీసులకు మనవి చేశాడు.

భార్య, పిల్లలు, ఉద్యోగం

భార్య, పిల్లలు, ఉద్యోగం

చెన్నైలోని అవడికి ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ (30) అనే యువకుడు భార్య అశ్విని, ఇద్దరు కుమారులు, ఒక కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. చెన్నైలోని అంబత్తూరులోని ప్రైవేట్ కంపెనీలో రాజేంద్రన్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేసి ఇంటికి వెళ్లి భార్య అశ్విని, ముగ్గురు పిల్లలతో కలిసి రాజేంద్ర సుఖంగా ఉండేవాడు.

పుట్టిల్లు పక్కనే ప్రియుడు

పుట్టిల్లు పక్కనే ప్రియుడు

రాజేంద్రన్ భార్య అశ్విని పుట్టిల్లు పెరంబూరులోని సెంబియంలో ప్రాంతంలో ఉంది. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న అనురగువంశి (22) అనే యువకుడితో అశ్వినికి పరిచయం ఏర్పడింది. భర్త, ముగ్గురు పిల్లలు ఉన్న అశ్విని అనురగువంశి వలలో పడింది.

అక్రమ సంబంధం!

అక్రమ సంబంధం!

పుట్టిల్లుకు వెళ్లి వచ్చే ముసుగులో అశ్విని ప్రియుడు అనురగువంశితో కలిసి తిరిగింది. భార్య అశ్విని, అనురగువంశిల అక్రమ సంబంధం విషయం ఆమె భర్త రాజేంద్రన్ కు తెలిసింది. జాగ్రత్తగా ఉండాలని, పిల్లల భవిష్యత్తు చూడాలని, నువ్వ ఇలాగే ప్రవర్తిస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయని రాజేంద్రన్ భార్య అశ్వినిని హెచ్చరించాడు.

భర్తను వదిలేసి పుట్టింటికి

భర్తను వదిలేసి పుట్టింటికి

రాజేంద్రన్, అశ్వినిల మధ్య నిత్యం ఆమె ప్రియుడు అనురగువంశి విషయంలో గొడవలు ఎక్కువ అయ్యాయి. తరువాత భర్త రాజేంద్రన్ ను వదిలేసిన అశ్విని పెరంబూరులోని పుట్టిల్లు చేరుకుంది. పుట్టిల్లులో ఉండే ముసులో ప్రియుడు అనురగువంశితో కలిసి విచ్చలవిడిగా తిరగడం మొదలుపెట్టింది.

కదులుతున్న రైలు నుంచి కిందకు తోసేసి!

కదులుతున్న రైలు నుంచి కిందకు తోసేసి!

డిసెంబర్ 30వ తేదీన రాజేంద్రన్ తిరుత్తిణి వెళ్లేందుకు అవడితో విద్యుత్ రైలు ఎక్కాడు. రాజేంద్రన్ ను వెంబడించిన అశ్విని ప్రియుడు అనురగువంశి, అతని అనుచరులు విద్యుత్ రైలు ఎక్కారు. రైలు కదులుతున్న సమయంలో అందరూ కలిసి రాజేంద్రన్ ను కిందకు తోసేసి అక్కడి నుంచి పరారైనారు.

నా హత్యకు భార్య కుట్ర

నా హత్యకు భార్య కుట్ర

రైలు నుంచి కిందకు తోసేయడంతో రాజేంద్రన్ కు తీవ్రగాయాలైనాయి. అరక్కోణం ఆసుపత్రిలో చికిత్స పొందిన రాజేంద్రన్ తను హత్యకు తన భార్య అశ్విని, ఆమె ప్రియుడు అనురగువంశి, అతని స్నేహితులు కుట్ర పన్నారని, రైలులో నుంచి కిందకు తోసేశారని రాజేంద్రన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నేనే ప్లాన్ వేశాను

నేనే ప్లాన్ వేశాను

రాజేంద్రన్ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు అతని భార్య అశ్విని ఇంటికి చేరుకుని విచారణ చేశారు. తన భర్త రాజేంద్రన్ హత్యకు తన ప్రియుడు అనురగువంశితో కలిసి ప్లాన్ వేశానని అశ్విని అంగీకరించిందని పోలీసులు అన్నారు. రాజేంద్రన్ మీద హత్యాయత్నం చేశారనే కేసులో అతని భార్య అశ్విని, ఆమె ప్రియుడు అనురగువంశి, అతని స్నేహితులు కమలేశ్వరన్, దినేష్ అనే నిందితులను అరెస్టు చేశామని గురువారం పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+