ప్రియుడితో రొమాన్స్ చేసిన ఫేమస్ హోటల్ ఓనర్ భార్య, రాత్రికి రమ్మని !

బెంగళూరు: జూన్ 28న దుండగులు ఓ వ్యక్తిపై ఆయుధాలతో దాడి చేసి హత్య చేసి పరారైన ఘటన బెంగళూరులోని తలఘట్టపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం అని మొదట కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు కలకలం రేపే సమాచారం బయటపెట్టారు. మృతుడి భార్య ఆమె ప్రేమికుడితో కలిసి భర్తను హత్య చేశారని వెలుగు చూసింది.

మొదట మృతదేహం ఎవరిది అనే కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు అసలు మ్యాటర్ బయటకు లాగారు. తలఘట్టపురలో నివాసం ఉంటున్న అరుణ్ కుమార్ అలియాస్ అరుణ్ (43) అనే యువకుడు హత్యకు గురైనాడని పోలీసులు చెప్పారు. జూన్ 28వ తేదీన రాత్రి 11 గంటలకు అరుణ్ దారుణ హత్యకు గురయ్యాడు. హత్య అనంతరం హంతకులు అరుణ్ మృతదేహాన్ని తలఘట్టపురలోని నిర్జన ప్రదేశంలో పడేశారు.

Bengaluru

పోలీసుల విచారణలో అరుణ్ హత్య వెనుక అతడి భార్య హస్తం ఉన్నట్లు తేలింది. అయితే అరుణ్ శవం చూసిన రోజు అతని భార్య రంజిత భర్త శవాన్ని చూసి రోదించింది. హత్యకు గురైన అరుణ్‌కుమార్‌ తలఘట్టపురలో గౌడ్రు బీకర ఊట మనే అనే హోటల్‌ నడుపుతున్నాడు. గణేష్ అనే యువకుడు అరుణ్ హోటల్‌కు తాగు నీరు, వాటర్ ట్యాంక్ లో నీళ్లు సరఫరా చేస్తున్నాడు. ఆ సమయంలో అరుణ్ భార్య రంజితకు, నీళ్లు సరఫరా చేస్తున్న గణేష్ కు పరిచయం అయ్యింది.

ఆసమయంలో అరుణ్ భార్య రంజితా నీళ్లు పరఫరా చేస్తున్న గణేష్‌తో చనువు పెంచుకుని అతని ఫోన్ నెంబర్ తీసుకుని రోజు గంటలు గంటలు మాట్లాడటం మొదలు పెట్టింది. హోటల్ నిర్వహించడానికి మీకు ఫైనాన్స్ ఇప్పిస్తానని నమ్మించిన గణేష్ అతని స్నేహితుడు అరుణ్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భర్త అరుణ్ హోటల్ లో వ్యాపారం చేస్తూ బిజీగా ఉండేవాడు.

Bengaluru

ఆ సమయంలో అరుణ్ భార్య రంజిత ఆమె ప్రియుడు గణేష్ ను ఇంటికి పిలిపించుకుని అతనితో రొమాన్స్ చేసింది. చాలాకాలం పాటు గణేష్, రంజితల అక్రమ సంబంధం సాఫీగా సాగిపోయింది. భార్య రంజిత అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న ఆమె భర్త అరుణ్ రంజితతో గొడవ పడి గణేష్ తో ప్రేమను వదులుకోవాలని హెచ్చరించాడు.

తన ప్రేమకు భర్త గణేష్ అడ్డుపడుతున్నాడని అతని భార్య రంజితా రగిలిపోయింది. రంజిత, ఆమె ప్రియుడు గణేష్ కలిసి హోటల్ యజమాని అరుణ్ ను చంపేయాలని పన్నాగం పన్నారు. అరుణ్ ను హత్య చెయ్యడానికి గణేష్ అతని స్నేహితులతో కలిసి స్కెచ్ వేశాడు. అరుణ్ హత్యకు గురైన ముందు రోజు రంజిత ఆమె సొంత ఊరు అయిన మండ్యకు వెళ్లింది.

ఈ సమయంలో గణేష్ మందు పార్టీ చేసుకుందామని, నీకు ఫైనాన్స్ లో డబ్బులు ఇప్పిస్తానని అరుణ్ కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ముందుగా టీమ్‌ను సిద్ధం చేసుకున్న గణేష్ అతని ప్రియురాలు రంజిత భర్త అరుణ్ చెప్పిన చోటకు రాగానే గణేష్ అతని ఫ్రెండ్స్ కలిసి అరుణ్ ను పట్టుకుని అతని కళ్లలో కారం పొడి చంపేశారు. తరువాత వేలకొడవళ్లు తీసుకుని ఇష్టం వచ్చినట్లు 20 సార్లు నరికేసి చంపేశారు.

హోటల్ యజమాని అరుణ్ హత్య కేసుకు సంబంధించి అరుణ్ భార్య రంజిత, ఆమె ప్రేమికుడు గణేష్ సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శివానంద, దీపు, శరత్ కూడా అరెస్టు అయ్యారని పోలీసులు అన్నారు. చెన్నపట్టణకు చెందిన అరుణ్‌కు ఆరేళ్ల క్రితం రంజితతో వివాహమైంది. బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ కు చేరుకున్న అరుణ్ గౌడ్రు మానే బీగర్ ఊట పేరుతో హోటల్ వ్యాపారం చేస్తున్నాడు.

Bengaluru

నిందితుడు గణేష్ అరుణ్ హోటల్ కు నీళ్లు సరఫరా చేసే పనిలో ఉన్నాడు. మృతుడు అరుణ్‌కు గణేష్ ఆర్థికసాయం కూడా చేశాడని తెలిసింది. అలా అరుణ్ భార్య రంజితతో పరిచయం పెంచుకున్న నీళ్ల వ్యాపారి ఆమెతో అక్రమ సంబందం పెట్టుకుని ఇంతకాలం పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడని పోలీసు అధికారులు తెలిపారు. అరుణ్ ను హత్య చేసిన తరువాత అతడి మృతదేహాన్ని నిర్జన ప్రదేశంలో విసిరేసిన గణేష్ అతని ఫ్రెండ్స్ పరారయ్యారు.

గణేష్, అరుణ్ ల మధ్య ఆర్థిక లావాదేవీలపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇదే కారణంతో పోలీసులు విచారణ చేపట్టగా అరుణ్ భార్య రంజిత. గణేష్ ప్రేమకథ బయటపడింది. అరుణ్ హత్యకు డబ్బు, వ్యాపార లావాదేవీలు మాత్రమే కారణం కాదని, రంజిత, గణేష్ ల అక్రమ సంబంధం అసలు కారణం అని వెలుగులోకి వచ్చింది. అరుణ్‌ను హత్య చేసిన తర్వాత నిందితులు దాక్కున్నారు. ఇప్పుడు పోలీసులకు చిక్కిపోయాడు. ఈ ఘటనపై తలఘట్టపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+