140 ఏళ్ల ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో సంచలనం: నాకౌట్స్ లో మాజీ ఛాంప్ అవుట్

ఫిఫా వరల్డ్ కప్ ఫుట్‌బాల్ నాకౌట్స్ లో సంచలనం చోటు చేసుకుంది. రౌండ్ ఆఫ్ 32 నాకౌట్స్ లో పరాగ్వే జట్టు అదరగొట్టింది. నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బలమైన జర్మనీని మట్టికరిపించింది. బోస్టన్ ఫాక్స్‌బరో స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఇరు జట్లూ హోరాహోరీగా పోరాడాయి. మ్యాచ్ పెనాల్టీ షూటౌట్స్ వరకూ వెళ్లిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

నిర్ణీత గడువుతో పాటు అదనపు సమయంలోనూ ఇరు జట్లు 1-1తో సమవుజ్జీలుగా నిలిచాయి. దీంతో పెనాల్టీ షూటౌట్స్ తప్పలేదు. ఇక్కడ పరాగ్వే చెలరేగింది. పెనాల్టీ షూటౌట్‌లో జర్మనీపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 4-3 తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. తదుపరి దశలో అడుగు పెట్టింది. ఇక రౌండ్ ఆఫ్ 16లో ఫ్రాన్స్ లేదా స్వీడన్ ను ఎదుర్కొనే అవకాశం ఉంది పరాగ్వేకు. ఈ పరాజయంతో జర్మనీ నాకౌట్స్ లోనే వెనుదిరిగింది.

FIFA World Cup Upsets as Paraguay Beats Germany 4-3 on Penalties Shootout and Advances to Round of 16

ఈ పెనాల్టీ షూటౌట్ ట్విస్టులతో సాగింది. 3-3తో సమానంగా నిలిచినప్పుడు పరాగ్వే డిఫెండర్ జోస్ కెనాల్ అత్యంత ఒత్తిడిలోనూ సంయమనం కోల్పోకుండా నిర్ణయాత్మకమైన గోల్‌ను విజయవంతంగా కొట్టి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అంతకుముందు పరాగ్వే రెండు పెనాల్టీలను చేజార్చుకుంది. జర్మనీకి చెందిన స్టార్ ఆటగాళ్లు కై హ్యావర్ట్జ్, నిక్ వోల్టెమేడ్, జోనాథన్ థా పెనాల్టీలను గోల్‌గా మలచడంలో విఫలమయ్యారు.

140 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో జర్మనీ జట్టు పెనాల్టీ షూటౌట్‌లో ఓడిపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. గేమ్ ప్రారంభం నుండీ జర్మనీ మ్యాచ్ పై పట్టు బిగించింది. టాప్ స్కోరర్ డెనిజ్ ఉండావ్ నేతృత్వంలో దూకుడుగా ఆడింది. అయినప్పటికీ, పరాగ్వే జట్టు అద్భుతమైన డిఫెన్స్‌తో వారిని సమర్థవంతంగా అడ్డుకుంది. మ్యాచ్ 35వ నిమిషం వరకు జర్మనీ దాదాపు 244 పాస్‌లు పూర్తి చేసినా గోల్‌ను మాత్రం నమోదు చేయలేకపోయింది. పరాగ్వే డిఫెన్స్ ఎంత బలమైందో ఇక్కడే స్పష్టమైంది.

అదే సమయంలో పరాగ్వే కౌంటర్ అటాకింగ్ వ్యూహాన్ని అమలు చేసింది. మిగ్యుల్ అల్మిరాన్ కుడి వైపు నుండి అందించిన అద్భుతమైన పాస్‌ను జూలియో ఎన్సిసో హెడర్ ద్వారా గోల్‌గా మలిచి పరాగ్వేకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. దీంతో జర్మనీ సెకెండ్ హాఫ్ లో మరింత శ్రమించింది. మ్యాచ్ 54వ నిమిషంలో ఫ్లోరియన్ విర్ట్జ్ అందించిన క్రాస్‌ను కై హ్యావర్ట్జ్ అద్భుతమైన హెడర్ ద్వారా గోల్‌గా మార్చి స్కోరును 1-1తో సమం చేశాడు.

ఆ తర్వాత 102వ నిమిషంలో జర్మనీ డిఫెండర్ జోనాథన్ థా వేసిన హెడర్ గోల్ జర్మనీని విజయతీరాలకు చేర్చిందని అంతా భావించారు. సుదీర్ఘ వీఏఆర్ (VAR) సమీక్ష తర్వాత పరాగ్వే గోల్‌కీపర్ ఓర్లాండో గిల్‌పై ఫౌల్ చేసినట్లు నిర్ధారించడంతో ఆ గోల్‌ రద్దయింది. మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ వైపు సాగింది. ఇక్కడ తనకు లభించిన అవకాశాలను పరాగ్వే సద్వినియోగం చేసుకుంది. ఈ కీలక సమయంలో జర్మనీ స్టార్ ఆటగాళ్లు కై హ్యావర్ట్జ్, నిక్ వోల్టెమేడ్, జోనాథన్ థా విఫలం అయ్యారు. 2010 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ తర్వాత పరాగ్వేకు దక్కిన అతిపెద్ద విజయం ఇదే.

జర్మనీ హెడ్ కోచ్ జూలియన్ నాగెల్స్‌మన్‌కు ఈ ఓటమి పెద్ద అవమానంగా మిగిలింది. 38 ఏళ్ల వయసులో నాకౌట్ మ్యాచ్‌కు కోచ్‌గా వ్యవహరించడం ద్వారా నలభై ఏళ్ల రికార్డును నెలకొల్పిన ఆయన ఇప్పుడు తీవ్ర విమర్శలతో ఒత్తిడిలో పడ్డారు. పరాగ్వే వంటి జట్టుతో ఓడిపోవడం తమ స్థాయికి తగదని నాగెల్స్‌మన్ ఒప్పుకున్నారు. గతంలో 2018, 2022 ప్రపంచకప్‌లలో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది జర్మనీ. నాకౌట్స్ లో ఓడిపోవడం అనేది మాత్రం ఇదే మొదటిసారి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+