Wife: నా మొగుడు పచ్చి కామాంధుడు, నేను తట్టుకోలేను, కోడిపులుసు టెక్నిక్‌తో చంపేసిన భార్య !

చెన్నై/ఈరోడ్/భవాని: ఏడు నెలల క్రితం గ్రాండ్ గా యువతి, యువకుడి పెళ్లి జరిగింది. వ్యవసాయ పోలంలోని ఇంటిలో హ్యాపీగా కాపురం పెట్టారు. మూడు ఎకరాల పోలంలో వ్యవసాయం చేయిస్తున్న భర్త రైస్ మిల్ నడుపుతున్నాడు. మొగుడికి విపరీతమైన సెక్స్ కోరికలు. ప్రస్తుతం భార్య గర్బవతి. మొగుడికి విపరీతమైన సెక్స్ కోరికలు ఉండటంతో అతని దెబ్బకు భార్య తట్టుకోలేకపోయింది. పెళ్లాం కాకుండా మనోడికి ఊర్లో కొన్ని అకౌంట్లు ఉన్నాయని సమాచారం. మొగుడి టార్చర్ తట్టుకోలేని భార్య కోడిపులుసులో పురుగుల మందు కలిపిపెట్టేయడంతో కథ సమాప్తం అయ్యింది.

 ఏడు నెలల ముందు పెళ్లి

ఏడు నెలల ముందు పెళ్లి

తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని అంతియూర్ కాలనీలో నందకుమార్ (33) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఏడు నెలల క్రితం మైథిలి (20) అనే యువతితో నందకుమార్ పెళ్లి జరిగింది. అంతయూర్ కాలనీలోని తోటలోని ఇంటిలో నందకుమార్, మైథిలి దంపతులు కొత్తగా కాపురం పెట్టారు.

 నందకుమార్ మస్త్ మజా

నందకుమార్ మస్త్ మజా

నందకుమార్ కు మూడు ఎకరాల వ్యవసాయ పోలం ఉంది. మూడు ఎకరాల్లో వ్యవసాయం చేయిస్తున్న నందకుమార్ తరువాత అంతియూర్ లోని రైస్ మిల్లును నడుపుతున్నాడు. పెళ్లి జరిగినప్పటి నుంచి నందకుమార్ భార్య మైథిలితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య మైథిలి కాకుండా నందకుమార్ కు ఊర్లో కొన్ని అకౌంట్ లు (అక్రమ సంబంధాలు) ఉన్నాయని తెలిసింది.

 ఆ రోజు ఏం జరిగిందంటే ?

ఆ రోజు ఏం జరిగిందంటే ?

జనవరి 28వ తేదీన నందకుమార్ పోలంలో పంటకు పురుగుల మందుకొట్టి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో భార్య మైథిలి కోడిపులుసు చేసి భర్తకు వడ్డించింది. కోడిపులుసు చేదుగా ఉండటంతో నందకుమార్ భార్య మైథిలిని ప్రశ్నించాడు. భార్య ఏదో చెప్పడంతో కొంచెం తిన్న నందకుమార్ తరువాత మళ్లీ పోలం దగ్గరకు వెళ్లిపోయాడు.

 పులుసు బాక్స్ మళ్లీ పార్శిల్

పులుసు బాక్స్ మళ్లీ పార్శిల్

పోలం దగ్గర ఉన్న నందకుమార్ కు అతని భార్య మైథిలి భోజనం, కోడిపులుసు బాక్స్ పార్శిల్ తీసుకెళ్లింది. భోజనం చేస్తున్న నందకుమార్ కు మళ్లీ ఆ కూర చేదుగా ఉండటంతో తట్టుకోలేకపోయాడు. కూర ఇంత చేదుగా ఎందుకు ఉందని నందకుమార్ భార్య మైథిలిని ప్రశ్నించాడు. మైథిలి ఏదో సమాధానం చెప్పింది. చేదు తట్టుకోలేని నందకుమార్ ఆ కూరతో పాటు అన్నం కూడా పొలంలో పడేశాడు.

 ఆసుపత్రిలో ఔట్

ఆసుపత్రిలో ఔట్

భోజనం చేసిన నందకుమార్ శరీరంలో చాలా మార్పులు వచ్చాయి. జనవరి 30వ తేదీన అంతియూర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నందకుమార్ కు చేర్పించి చికిత్స అందించారు. నందకుమార్ శరీరంలో విషం ఎక్కువగా ఉందని వైద్యులు చెప్పారు. తరువాత ఈరోడ్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి నందకుమార్ ను తరలించారు. చికిత్స విఫలమై ఫిబ్రవరి 15వ తేదీన నందకుమార్ మరణించాడు.

 నా పెళ్లాం పులుసు పెట్టింది

నా పెళ్లాం పులుసు పెట్టింది

నందకుమార్ విషం కలిపిన భోజనం తినడం వలనే మరణించాడని వైద్యులు చెప్పారు. అంతకు ముందు ఆసుపత్రిలో చికిత్స పొందిన నందకుమార్ తన భార్య మైథిలి కోడిపులుసు భోజనం పెట్టిందని పోలీసులకు అప్పుడే చెప్పాడు. పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. నందకుమార్ భార్య మైథిలిని పోలీసులు అదుపులోకి తీసుని విచారణ చెయ్యగా షాక్ అయ్యారు.

 ఇలాంటి సెక్స్ నావల్ల కాదు

ఇలాంటి సెక్స్ నావల్ల కాదు

నేను ప్రస్తుతం 5 నెలల గర్బవతి అని మైథిలి పోలీసులకు చెప్పింది. తన మొగుడు నందకుమార్ పచ్చి కామాంధుడని, పగలు రాత్రి అని తేడా లేకుండా విచ్చలవిడిగా సెక్స్ చెయ్యాలని తనను టార్చర్ పెట్టాడని, అతని కామం తీర్చలేకపోయానని, గర్బవతి అని కూడా చూడకుండా తనకు చిత్రహింసలు పెట్టాడని మైథిలి పోలీసులకు సమాచారం ఇచ్చింది.

 తట్టుకోలేక విషం పెట్టి చంపేశాను

తట్టుకోలేక విషం పెట్టి చంపేశాను

మొగుడి విచ్చలవిడి కామకోరికలు తీర్చలేక అతనికి భోజనంలో విషయం పెట్టి చంపేశానని మైథిలి పోలీసులకు సమాచారం ఇచ్చింది. మైథిలిపై హత్య కేసు నమోదు చేసి భవాని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ఆమెను కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు తరలించారు. కామాంధుడైన భర్త కామకోరికలు తీర్చలేక భార్య అతనికి విషయం పెట్టి చంపిందని వెలుగు చూడటం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+