Wife: భార్యను పబ్లిక్ గా దారుణంగా నరికిన భర్త, సైకోకు సినిమా చూపించిన పోలీసులు, లవ్ స్టోరీలో !

బెంగళూరు: హిందూ అమ్మాయి, ముస్లీం అమ్మాయి ప్రేమించుకున్నారు. ముస్లీం యువకుడిని పెళ్లి చేసుకోవడానికి వీలులేదని అమ్మాయి కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. తల్లిదండ్రులను ఎదిరించి ప్రియుడిని పెళ్లి చేసుకుని అతనితో కాపురం చేసింది. దంపతులకు ఓ బిడ్డ పుట్టింది. హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్న భర్త ఆమెను బలవంతంగా ఇస్లాం మతం స్వీకరించేలా చేశాడు. కొంతకాలం తరువాత భార్య బుర్కా వేసుకుంటేనే బయటకు వెళ్లాలని షరతులు పెట్టాడు. భర్త పెడుతున్న టార్చర్ తట్టుకుని ఆమె భర్త ఇంట్లోనే ఉండిపోయింది. తరువాత భార్యకు ఓ షాకింగ్ విషయం తెలిసింది. తనకంటే ముందే తన భర్త ఓ ముస్లీం మహిళను వివాహం చేసుకున్నాడని, వారికి పిల్లలు కూడా ఉన్నారని, తాను రెండో భార్య అని తెలుసుకుంది, భర్త టార్చర్ తట్టుకోలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. రెండో భార్య దూరం అయ్యిందని ఆమె భర్త రగిలిపోయాడు. గ్రౌండ్ లో స్కూటర్ డ్రైవింగ్ నేర్చుకుంటున్న రెండో భార్య మీద ఆమె భర్త కొడవలితో దారుణంగా నరికేశాడు. రెండో భార్యను హత్య చెయ్యడానికి ప్రయత్నించి తప్పించుకుని పారిపోయిన శాడిస్టు మొగుడు చివరికి పోలీసులకు చిక్కాడు. పోలీసుల విచారణలో శాడిస్టు భర్త గురించి అతని రెండో భార్య షాకింగ్ విషయాలు చెప్పింది.

నమ్మించి పెళ్లి చేసుకున్న ప్రియుడు

నమ్మించి పెళ్లి చేసుకున్న ప్రియుడు

కర్ణాటకలోని గదగ్ లో అపూర్వా పురాణిక్ అలియాస్ అపూర్వా అనే యువతి నివాసం ఉంటున్నది. కర్ణాటకలోని హుబ్బళిలో ఇజాజ్ శిరూర్ అలియాస్ ఇజాజ్ పాషా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఇజాజ్, అపూర్వాకు పరిచయం అయ్యింది. కొంతకాలం తరువాత అపూర్వా, ఇజాజ్ ప్రేమించుకున్నారు. ముస్లీం యువకుడు ఇజాజ్ ను పెళ్లి చేసుకోవడానికి వీలులేదని అపూర్వాకు ఆమె కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. తల్లిదండ్రులను ఎదిరించిన అపూర్వా ఆమె ప్రియుడు ఇజాజ్ ను పెళ్లి చేసుకుని అతనితో కాపురం చేసింది.

సినిమా చూపించిన మొగుడు

సినిమా చూపించిన మొగుడు


ఇజాజ్, అపూర్వా దంపతులకు ఓ బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టిన తరువాత భర్త ఇజాజ్ అసలు స్వరూపం తెలుసుకున్న అతని భార్య అపూర్వా షాక్ అయ్యింది. హిందూ అమ్మాయి అపూర్వాని పెళ్లి చేసుకున్న ఇజాజ్ ఆమెను బలవంతంగా ఇస్లాం మతం స్వీకరించేలా చేశాడు. అపూర్వా పేరును అర్పా బానుగా మార్చేశాడు. కొంతకాలానికి అపూర్వా బుర్కా వేసుకుంటేనే బయటకు వెళ్లాలని ఆమె భర్త ఇజాజ్ షరతులు పెట్టాడు. భర్త ఇజాజ్ పెడుతున్న టార్చర్ తట్టుకున్న అపూర్వా ఆమె భర్త ఇంట్లోనే కుమిలిపోయి కొంతకాలం గడిపింది.

భర్త కాలాంతకుడు

భర్త కాలాంతకుడు

ప్రేమ వివాహం చేసుకున్న అపూర్వా భర్త ఇజాజ్ పెట్టే టార్చర్ తట్టుకోలేక, ఆమె పుట్టింటికి వెళ్లలేక కుమిలిపోయింది. రానురాను భర్త ఇజాజ్ ఆగడాలు ఎక్కువ అయ్యాయి. ఇదే సమయంలో అపూర్వాకు ఓ షాకింగ్ విషయం తెలిసింది. తనకంటే ముందే తన భర్త ఇజాజ్ ఓ ముస్లీం మహిళను వివాహం చేసుకున్నాడని, వారికి పిల్లలు కూడా ఉన్నారని, తాను రెండో భార్య అని తెలుసుకుంది, తనను ప్రేమించినట్లు నటించిన తన భర్త ఇప్పటికే వేరే మహిళతో కాపురం చేస్తున్నాడని, తనను మోసం చేశాడని అపూర్వా కుమిలిపోయింది.

Recommended Video

    రాజేష్ మగాడంటే నమ్మేదే లేదు.. తొలిరాత్రే చెప్పాడు..!
    సైకో భర్త అరెస్టు

    సైకో భర్త అరెస్టు

    భర్త ఇజాజ్ టార్చర్ తట్టుకోలేక అపూర్వా ఆమె తల్లిదండ్రుల కాళ్లు పట్టుకుని చివరికి నాలుగు నెలల క్రితం గదగ్ లోని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. రెండో భార్య అపూర్వా దూరం అయ్యిందని ఆమె భర్త ఇజాజ్ రగిలిపోయాడు. గదగ్ లోని లయన్ స్కూల్ గ్రౌండ్ లో స్కూటర్ డ్రైవింగ్ నేర్చుకుంటున్న రెండో భార్య అపూర్వా మీద ఆమె భర్త ఇజాజ్ కొడవలితో ఇష్టం వచ్చినట్లు నరికేశాడు. భార్య అపూర్వాను దారుణంగా నరికేసిన ఇజాజ్ తప్పించుకున్నాడు. మూడు రోజులు గాలించిన ఇజాజ్ ను పోలీసులు పట్టుకుని బెండ్ తీశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అపూర్వా ఆమె భర్త ఇజాజ్ ఆగడాల గురించి చెప్పడంతో పోలీసులు హడలిపోయారు. కోర్టుఅనుమతితో ఇజాజ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+