Wife: లవ్ మ్యారేజ్, భర్త మీద కోపంతో ఇద్దరు కొడుకులను చంపేసింది, ఆవేశంలో అక్కడే ఆత్మహత్య !
చెన్నై/సేలం: వేర్వేరు కులాలకు చెందిన యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ప్రేమికులు చాలా కాలం పాటు సంతోషంగా తిరిగారు. కులాలు వేరు కావడంతో ఎవ్వరిని లెక్కచెయ్యకుండా పెళ్లి చేసుకున్నారు. భర్తకు సొంతంగా లారీలు ఉండటంతో డబ్బులు బాగా సంపాధిస్తున్నారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత దంపతుల తల్లిదండ్రులు అందరితో కలిసిపోయారు. కొంతకాలం నుంచి దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. బంధువులు, కుటుంబ సభ్యులు రాజీ చేస్తూ వచ్చారు. అయితే దంపతుల మద్య గొడవలు మాత్రం తగ్గలేదు. భార్యతో గొడవపడిన భర్త బయటకు వెళ్లిపోయాడు. ఇంట్లోకి వెళ్లిన భార్య ఆమె భర్త మీద కోపంతో ఇద్దరు బిడ్డలను చంపేసింది. పిల్లలను హత్య చేసిన తల్లి వారి ప్రాణాలు పోయాయా, లేదా అని నిర్దారించుకున్న తరువాత ఆమె కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

కులాలు వేరు..... లవ్ మ్యారేజ్
తమిళనాడులోని సేలంలో రాజేష్ కుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నారు. సేలంలోని సెనాయ్ నగరలో నివాసం ఉంటున్న కురించి తమిళ్ అలియాస్ తమిళ సెల్వి (29) అనే యువతి, రాజేష్ కుమార్ కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారు.

దంపతులకు ఇద్దరు పిల్లలు
ప్రేమికులు రాజేష్ కుమార్, తమిళ సెల్వి చాలా కాలం పాటు సంతోషంగా తిరిగారు. కులాలు వేరు కావడంతో ఎవ్వరిని లెక్కచెయ్యకుండా రాజేష్ కుమార్, తమిళ సెల్వి పెళ్లి చేసుకున్నారు. భర్త రాజేష్ కుమార్ కు సొంతంగా లారీలు ఉండటంతో డబ్బులు బాగా సంపాధిస్తున్నారు.

బిడ్డలు పుట్టిన తరువాత గొడవలు
రాజేష్ కుమార్, తమిళ సెల్వి దంపతులకు విమల్ ప్రణవ్ (7), కార్తీక్ ప్రణవ్ (4) అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత రాజేష్ కుమార్, తమిళ సెల్వి దంపతుల తల్లిదండ్రులు అందరితో కలిసిపోయారు. కొంతకాలం నుంచి రాజేష్ కుమార్, తమిళ సెల్వి దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి.

బిడ్డలను చంపేసి తల్లి ఆత్మహత్య
బంధువులు, కుటుంబ సభ్యులు రాజేష్ కుమార్, తమిళ సెల్వి మద్య రాజీ చేస్తూ వచ్చారు. అయితే రాజేష్ కుమార్, తమిళ సెల్వి దంపతుల మద్య గొడవలు మాత్రం తగ్గలేదు. భార్య తమిళ సెల్వీతో గొడవపడిన భర్త బయటకు వెళ్లిపోయాడు. ఇంట్లోకి వెళ్లిన తమిళ సెల్వి ఆమె భర్త రాజేష్ కుమార్ మీద కోపంతో ఇద్దరు బిడ్డలను చంపేసింది. పిల్లలను హత్య చేసిన తమిళ సెల్వి వారి ప్రాణాలు పోయాయా, లేదా అని నిర్దారించుకున్న తరువాత ఆమె కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications