Wife: దంపతుల గొడవ, రోడ్డు మీద రాజీ, భర్త మీద దాడి, భర్త ముందే భార్య మీద ఆరుమంది ?, ఫ్రెండ్స్ !

జార్ఖండ్: రాత్రి ఇంట్లో దంపతుల మద్య గొడవ జరిగింది. వయసులో ఉన్న భార్య ఆవేశంతో భర్త మీద ఊగిపోయింది. నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అంటూ మాటల యుద్దం జరిగింది. భర్త మీద కోపంతో భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. భయపడిన భర్త బంధువుతో కలిసి క్యాబ్ బుక్ చేసుకుని భార్య కోసం వెతికాడు. రాత్రి రోడ్డు మీద నడుచుకుంటూ పుట్టింటికి వెలుతున్న భార్యను అడ్డుకున్న భర్త, అతని బంధువు ఆమెకు సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. అదే సమయంలో బైక్ ల్లో వెళ్లిన ఆరు మంది కామాంధులు భర్తను చితకబాదేసి అతని భార్యను సమీపంలోని నిర్జనప్రదేశంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. తరువాత భార్యను బైక్ లో కిడ్నాప్ చెయ్యడానికి ప్రయత్నించారు. తన భార్య మీద సామూహిక అత్యాచారం చేసిన ఆరు మందిలో ఇద్దరు మాకు పరిచయం ఉన్నారని భర్త పోలీసులకు చెప్పడం కలకలం రేపింది.

దంపతులు హ్యాపీ

దంపతులు హ్యాపీ

జార్ఖండ్ లోని బలము జిల్లాలోని సత్ బావ్రాలో 22 ఏళ్ల యువతి ఆమె భర్తతో కలిసి నివాసం ఉంటున్నది. భార్యది కూడా బలము పక్క జిల్లా. గత ఏడాది వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా ఉంటున్నారు. అయితే దంపతుల మద్య చిన్నచిన్న కారణాల వలన అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయని తెలిసింది.

 పుట్టింటికి నడుచుకుంటూ బయలుదేరిన భార్య

పుట్టింటికి నడుచుకుంటూ బయలుదేరిన భార్య

రాత్రి ఇంట్లో దంపతుల మద్య గొడవ జరిగింది. వయసులో ఉన్న భార్య ఆవేశంతో భర్త మీద ఊగిపోయింది. నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అంటూ మాటల యుద్దం జరిగింది. భార్యకు నచ్చచెప్పడానికి ఆమె భర్తతో పాటు అతి బంధువులు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే భర్త మీద కోపంతో భార్య ఆవేశంగా బయటకు వెళ్లిపోయి పుట్టింటికి నడుచుకుంటూ బయలుదేరింది.

రోడ్డు మీద దంపతులు రాజీఅవుతుంటే ?

రోడ్డు మీద దంపతులు రాజీఅవుతుంటే ?

భార్య వెళ్లిపోవడంతో భయపడిన భర్త బంధువుతో కలిసి క్యాబ్ బుక్ చేసుకుని అతని భార్య కోసం వెతికాడు. రాత్రి రోడ్డు మీద నడుచుకుంటూ పుట్టింటికి వెలుతున్న భార్యను అడ్డుకున్న భర్త, అతని బంధువు ఆమెకు సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. రోడ్డు మీద దంపతులు మాట్లాడుకుంటున్న సమయంలో బైక్ ల్లో ఆరు మంది కామాంధులు అక్కడికి వెళ్లారు.

భర్తను చితకబాదేసి భార్య మీద గ్యాంగ్ రేప్

భర్తను చితకబాదేసి భార్య మీద గ్యాంగ్ రేప్


ఆ సమయంలో అటువైపు వాహన సంచారం తక్కువగా ఉండటంతో కామాంధులు మహిళ భర్తను చితకబాదేశారు. దెబ్బలు తట్టుకోలేక భర్త కుప్పకూలిపోయాడు. ఆ సందర్బంలో అతని భార్యను సమీపంలోని నిర్జనప్రదేశంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. భర్త కళ్ల ముందే ఆరు మంది మహిళ మీద సామూహిక అత్యాచారం చేశారు.

మహిళను కిడ్నాప్ చెయ్యాలని ?

మహిళను కిడ్నాప్ చెయ్యాలని ?

మహిళ మీద సామూహిక అత్యాచారం చేసిన తరువాత ఆమెను బైక్ లో కిడ్నాప్ చెయ్యడానికి ప్రయత్నించారు. అయితే బైక్ ను కారు ఢీకొనడంతో నిందితులు కిందపడిపోయాడు. బాధితురాలు కేకలు వెయ్యడంతో స్థానిక గ్రాములు వెళ్లి ఇద్దరు కామాంధులను పట్టుకుని మహిళలను రక్షించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

నిందితులు భర్తకు తెలిసిన వాళ్లే

నిందితులు భర్తకు తెలిసిన వాళ్లే

తన భార్య మీద సామూహిక అత్యాచారం చేసిన ఆరు మందిలో ఇద్దరు మాకు పరిచయం ఉన్నారని భర్త పోలీసులకు చెప్పాడు. గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. భర్త కళ్ల ముందే భార్య మీద ఆరు మంది గ్యాంగ్ రేప్ చెయ్యడం జార్ఖండ్ లో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+