కూలీ పని చేసి పోలీస్ ను చేస్తే.. ఎఫైర్ పెట్టుకుని భర్తనే..
ప్రస్తుతం సమాజంలో భర్తలను చంపేస్తున్న భార్యలు.. కొత్త ట్రెండ్ గా మారిపోయింది. దేశంలో జరుగుతున్న వరుస సంఘటనలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ప్రియుడిని మర్చిపోలేకే భార్యలు ఈ పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేమించిన ప్రియుడిని మర్చిపోలేక కొన్ని రోజులకే భర్తలకు విడాకులిస్తున్నవాళ్లు ఓ వైపు ఉంటే ఏకంగా భర్తలకే స్పాట్ పెట్టేస్తున్న వాళ్లు మరోవైపు ఉన్నారు. ఇప్పుడు ఇదో ట్రెండ్ గా మారిపోయినట్లు తెలుస్తోంది. దీంతో పెళ్లంటేనే యువత ఆమడ దూరం పారిపోతుంది. తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది.
ఆ మహిళకు అన్నీ తానై కూలీ పని చేసి పోలీస్ ను చేసి ఆమె కలను నిజం చేశాడు భర్త. కోచింగ్ తో పాటు మంచి చదువులు చెప్పించాడు. కానీ ఆమె చేసిన పనికి సభ్య సమాజం తలదించుకుంటోంది. ఈ వార్త ప్రస్తుతం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లోని కట్ని జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. అదే జిల్లాకు చెందిన జైలాల్ అనే వ్యక్తికి రీటా అనే యువతికి 2023లో వివాహం జరిగింది. అయితే పోలీస్ కావాలని తన కల అని జైలాల్ కు చెప్పింది భార్య రీటా. అయితే ఆమెను కూలీ పని చేసి మరీ చదివించాడు. మంచి కోచింగ్ ఇప్పించాడు.
అయితే రీటాకు పోలీస్ ఉద్యోగం వచ్చింది. రీటాకు సాగర్ జిల్లాలోని గోపాల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ ఇచ్చారు. ఇద్దరూ సంవత్సరం పాటు అక్కడే అద్దె ఇంట్లో ఉన్నారు. అయితే ఓ సారి పని నిమిత్తం తన భర్త జైలాల్ ను భార్య రిటా జబల్ పూర్ కు పంపించింది. ఈ క్రమంలో రీటా.. లక్కీ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్నాళ్లు జబల్ పుర్ లో పనిచేసిన జైలాల్.. భార్య వద్దకు వచ్చాడు. రీటా ఫోన్ లో లక్కీ అనే యువకుడితో దిగిన ఫొటోలు, వీడియోలు చూసిన జైలాల్.. భార్యను ప్రశ్నించాడు.

ఈ క్రమంలో రీటా, ఆమె ప్రియుడు లక్కీ.. జైలాల్ ను బెదిరించారు. చంపేస్తామన్నారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాడు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications