వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెత్తకు-వైఫైకి లింకు?: ఆ డబ్బాలో చెత్త వేస్తే.. ఫ్రీ వైఫై..

యూజర్లు వేసిన చెత్తను గుర్తించి పై భాగంలో అమర్చిన ఎల్‌ఈడీ స్క్రీన్‌కు మెసేజ్ పంపుతుంది. దీంతో ఆ మెసేజ్‌ను రిసీవ్ చేసుకున్న ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ఓ పాస్‌వర్డ్ దర్శనమిస్తుంది.

|
Google Oneindia TeluguNews

ముంబై: ఎక్కడికెళ్లినా.. ఏ పనుల్లో నిమగ్నమైనా.. ఈరోజుల్లో ఇంటర్నెట్ అనేది కనీస అవసరంగా మారిపోయింది. కావాల్సిన సమాచారాన్ని వెతుక్కోవడానికో.. సోషల్ మీడియాలో టైమ్ పాస్ చేయడానికో.. మొత్తానికి ఇంటర్నెట్ అనేది తప్పనిసరి అయిపోయిన పరిస్థితి. ఒకరకంగా ఇదో బలహీనత.. బలం.. రెండూ.

సరిగ్గా ఇదే పాయింట్‌పై ఫోకస్ చేసిన థింక్ స్క్రీమ్ అనే ఓ స్టార్టప్ సంస్థ.. మనుషుల్లో పరివర్తన కోసం దీన్ని ఉపయోగించుకుంటోంది. 'చెత్త వేయండి.. ఫ్రీ వైఫై పొందండి' అన్న ప్రచారంతో దీనికి మరింత ఊపు తీసుకొచ్చింది. రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా చెత్త లేకుండా చేయాలనే మంచి ఆశయంతో వైఫై ట్రాష్ బిన్‌ లను ఏర్పాటు చేసింది.

 WiFi Trash Cans? This Mumbai Startup Has Bin There, Done That

సాధారణ చెత్త కుండీని పోలి ఉండే ఈ వైఫై ట్రాష్ బిన్ నాలుగున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. దీని కింది భాగంలో అమర్చిన ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్.. యూజర్లు వేసిన చెత్తను గుర్తించి పై భాగంలో అమర్చిన ఎల్‌ఈడీ స్క్రీన్‌కు మెసేజ్ పంపుతుంది. దీంతో ఆ మెసేజ్‌ను రిసీవ్ చేసుకున్న ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ఓ పాస్‌వర్డ్ దర్శనమిస్తుంది.

ఆ పాస్ వర్డ్ ఉపయోగించుకుని ట్రాష్ బిన్ లో అమర్చిన వైఫై రూటర్ కు కనెక్ట్ అవచ్చు. ఇలా చెత్త నిమిషాల పాటు ఉచిత వైఫైని ఉపయోగించుకోవచ్చు. దాదాపు 50మీటర్ల దూరం వరకు ఈ వైఫై సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ముంబై అంతటా ఏర్పాటు చేసిన ఈ వైఫై ట్రాష్ బిన్ లకు మంచి స్పందన లభిస్తోందని సదరు స్టార్టప్ సంస్థ చెబుతోంది.

English summary
Startup ‘ThinkScream’ came up with the ‘wifi trash bin’. Every time you responsibly dispose trash, it gives you access to 15 minutes of free wifi and here’s what the design looks like. It is four and a half feet tall and has an LED screen to generate the access code
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X