సిలిగురిలో ఏనుగు బీభత్సం: ఇళ్లపై దాడి (వీడియో)
సిలిగురి: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. అడవిలో నుంచి జనావాసాల్లోకి వచ్చిన ఏనుగు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. మంగళవారం బైకుంతపూర్ అటవీ ప్రాంతం నుంచి తప్పించుకొని వీధుల్లో తిరుగుతూ ఇళ్లుపై దాడి చేసింది.
ఏనుగు దాడిలో సుమారు 100 ఇళ్లు, ఆరు భవనాలు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలో మూడు జిల్లాల్లోని మూడొందలకు పైగా గ్రామాల్లో ఈ ఏనుగు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఏనుగు పురాలియా ప్రాంతంలో దాడి చేస్తుంది.

సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఏనుగును పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications