Delhi Polls: ఢిల్లీలో మారిన లెక్క- ఆ పార్టీ జస్ట్ గట్టెక్కుతుందా ? తాజా సర్వే..

ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే నెల 5న జరిగే ఎన్నికల్లో ఏం జరగబోతోందనే దానిపై దేశవ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
గతంలో మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన ఆప్ తో కేంద్రంలో హ్యాట్రిస్ సాధించిన బీజేపీ ముఖాముఖీ తలపడుతున్న ఈ పోరులో విజేత ఎవరన్న దానిపై ఇప్పటికే పలు సర్వేలు వెలువడ్డాయి. అయితే గతంలో సర్వేలు ఇచ్చిన పలు సంస్థలు ఇప్పుడు గొంతు సవరించుకుంటున్నాయి. హస్తినను గెలవడం అంత సులువు కాదని తేల్చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఢిల్లీ ఓటరు ఎవరిని కరుణించబోతున్నాడనే అంశంపై రాజస్తాన్ కు చెందిన ఫలోడీ సత్తా బజార్ గతంలో వేసిన లెక్కల్ని మరోసారి సవరించింది. ఇప్పటి వరకు వెలువడిన పలు ఒపీనియన్ పోల్‌లు అధికార ఆప్ కు ఆధిక్యం కట్టబెట్టాయి. ఇదే క్రమంలో రాజస్థాన్‌లోని ఫలోడిలో ఉన్న సత్తా బజార్ బెట్టింగ్ మార్కెట్ కూడా ఆప్ కు 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో 36 సీట్లు వస్తాయని గతంలో అంచనా వేసింది. ఆ తర్వాత దీన్ని 37-39కి సవరించింది. ఇప్పుడు మరోసారి అంచనాల్ని బయటపెట్టింది.

will aap retain power in delhi Phalodi satta bazar s latest prediction is here

ఇందులో మరోసారి ఆప్ అధికారం నిలబెట్టుకుంటుందని ఫలోడీ సత్తా బజార్ అంచనా వేసింది. అయితే ఆప్ భారీ సంఖ్యలో సీట్లు కోల్పోవడం ఖాయమని తేల్చేసింది. 2015, 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన చాలా సీట్లను ఆప్ కోల్పోవవడం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు అంచనా వేశాయి. ఇప్పుడు ఫలోడీ సత్తా బజార్ కూడా అదే చెబుతోంది. తాజా అంచనాల ప్రకారం 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో 38-40 సీట్లు లభిస్తాయని అంచనా వేసింది. గతంలో 2015లో 67 2020లో 63 సీట్లను ఆప్ గెల్చుకుంది.

ఈసారి ఆప్ కు గట్టి పోటీ ఇస్తున్న బీజేపీకి ఈసారి 31-33 సీట్లు వస్తాయని ఫలోడీ సత్తా బజార్ అంచనా వేసింది. అయితే కాంగ్రెస్ కు మాత్రం గతంలో ఇచ్చిన ఒక్క సీటు కూడా రావడం కష్టమేనని తాజా అంచనాల్లో స్పష్టం చేసింది. ఢిల్లీలో 70 స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా.. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+