వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజినీకి అదే చింత: రాజకీయ పార్టీపై ఎంకే స్టాలిన్ స్పందన

|
Google Oneindia TeluguNews

చెన్నై: వచ్చే జనవరిలో రాజకీయ పార్టీని ప్రారంభిస్తానంటూ సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన ప్రకటనపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్పందించారు. మొదట రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టి, రాజకీయ విధానాన్ని చెప్పనివ్వండి, అప్పుడు తాను స్పందిస్తానని వ్యాఖ్యానించారు.

ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చన్నారు. అలాగే తన రాజకీయ సలహాదారుని ఎంపికపై రజినీకాంత్ చింతిస్తున్నారని తెలిసిందంటూ చెప్పుకచ్చారు. తమిళరువి మనియన్‌ను రాజకీయ సలహాదారుగా ఎంపిక చేయడంపై రజనీకాంత్ చింతిస్తున్నారని తనకు తెలిసిందని స్టాలిన్ తెలిపారు.

Will comment on Rajinikanth once he floats his party: DMK President MK Stalin

కాగా, కొన్ని నెలలుగా రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించిన రజినీకాంత్.. తాజాగా, వచ్చే ఏడాది జనవరిలో తాను రాజకీయ పార్టీని ప్రకటిస్తానంటూ తెలిపిన విషయం తెలిసిందే. అంతేగాక, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామన్నారు. అంతేగాక, ఎన్నికల్లో విజయం సాధిస్తామని కూడా ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు తలరాతను మార్చాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

తాను ఇచ్చిన హామీలపై ఎప్పుడూ వెనక్కి వెళ్లేదని లేదని చెప్పారు. ప్రస్తుతం రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. మార్పు ఇప్పుడు జరగకపోతే ఇంకెప్పటికీ జరగదని స్పష్టం చేశారు. వైద్యులు వద్దంటున్నా.. ప్రజలు, అభిమానుల కోసం రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రాజకీయ అరంగేట్రం కోసం రాష్ట్రంలో పర్యటించాలనుకున్నా.. కరోనా వల్ల అది సాధ్యపడలేదని వివరించారు.

ప్రజలు తన వెంట నడిస్తే మనమంతా కలిసి మార్పును తీసుకొద్దామని రజనీ వ్యాఖ్యానించారు. ప్రజల ఆదరణతో కష్టపడి పనిచేసి రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తానని రజనీకాంత్ ధీమా వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఆదరణతో గెలిచి రాష్ట్రంలో నిజాయితీ, న్యాయమైన, కులమతాలకు అతీతమైన ఆధ్యాత్మిక రాజకీయాలకు నాంది పలకడం నిశ్చయమని రజనీకాంత్ స్పష్టం చేశారు.

అద్భుతాలు జరుగుతాయని, అన్నింటినీ మారుస్తామని రజినీకాంత్ స్పష్టం చేశారు. రజనీ రాజకీయ రంగప్రవేశంపై సుదీర్ఘంగా ఎదురుచూపులు కొనసాగిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు తాను 2021, జనవరిలో రాజకీయ పార్టీని ప్రకటిస్తానని, వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని రజనీకాంత్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డిసెంబర్ 31న వెల్లడిస్తానని రజనీ తెలిపారు. ఇప్పటికే ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజకీయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. రజనీ రాకతో తమిళ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి.

English summary
Dravida Munnetra Kazhagam (DMK) President M.K. Stalin on Monday said he would comment on Rajinikanth entering politics after he floats his party and announces its ideologies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X