కరుణానిధికికి షాక్: కొత్త పార్టీ దిశగా తనయుడు అళగిరి

తన కేడర్‌తో చర్చించాక వచ్చే రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటానన్నారు. రెండు నెలల కిందట పార్టీకి రెబల్ నేతగా మారి తండ్రి కరుణను ధిక్కరించిన అళగిరిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడంతో బహిష్కృత వేటు పడింది.
అప్పటి నుంచి అళగిరి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. డిఎంకె లోకసభ అభ్యర్థుల లిస్టులో అళగిరి పేరు కూడా లేదు. దీంతో అసహనానికి గురైన ఆయన కొత్త పార్టీ దిశలో అడుగులు వేస్తున్నారు.
కాగా, కరుణానిధి తన తనయుడు అళగిరిని పార్టీలో నుండి, పార్టీ పదవుల నుండి జనవరిలో సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అళగిరి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. సస్పెన్షన్‌కు ముందు అళగిరిని, ఆయన అనుచరులను కరుణానిధి తీవ్రంగా హెచ్చరించారు. అయినా సద్దుమణగలేదు. దీంతో ఈ రోజు పార్టీలోన్ని అన్ని పదవుల నుండి అళగిరిని బహిష్కరించారు. డిఎంకె పార్టీ విజయకాంత్ నేతృత్వంలోని డిఎండికెతో పొత్తు ప్రయత్నాలు చేస్తోంది. దీనిని అళగిరి, ఆయన వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.












Click it and Unblock the Notifications