సూర్య గ్రహణంతో కరోనా మహమ్మారి అంతమైనట్లే? భూమికి దగ్గరగా సూర్యుడు వస్తేనే!
ఆదివారం(జూన్ 21న పూర్తిస్థాయి సూర్య గ్రహణం ఏర్పడింది. ఈ గ్రహణ ప్రభావం ఆసియా, ఆప్రికా దేశాల్లోనే ఎక్కువగా ఉంది. ఈ దేశాల్లోని ప్రజలు సూర్య గ్రహణాన్ని తిలకించారు. పలు ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించగా.. మరికొన్ని ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకోవడంతో సూర్య గ్రహణాన్ని చూడలేకపోయారు. ఆసియా, ఆఫ్రికా దేశాలతోపాటు ప్రపంచంలోని అమెరికా, యూరప్ ప్రాంతాల్లో కూడా సూర్యగ్రహణం పాక్షికంగా కనిపించింది.

సూర్య గ్రహణం ఇలా..
ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 9.16 గంటలకు మొదలైన సూర్య గ్రహణం.. మధ్యాహ్నం 12 గంటలా 10 నిమిషాల వరకు కొనసాగనుంది. ఇక మన దేశంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కొనసాగనుంది. తెలుగు రాష్ట్రాల్లో సూర్య గ్రహణం మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుందని శాస్త్రవేత్తలు, జ్యోతిష్కులు చెబుతున్నారు. ఎక్కువ ప్రాంతాల్లో సంపూర్ణంగా కాకుండా ఉంగరం ఆకారంలో గ్రహణం ఏర్పడింది.

కరోనా మహమ్మారిపై ప్రభావం ఎంత?
కాగా, ప్రస్తుతం కరోనా మహమ్మారితో ప్రపంచం వణికిపోతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సూర్యగ్రహణ ప్రభావం కరోనాపై ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. సూర్య గ్రహణం కారణంగా కరోనా వైరస్ అంతమయ్యే అవకాశాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇందులో ఎంత వరకు నిజం ఉంది.. కరోనాను ఈ సూర్య గ్రహణం అంతం చేస్తుందా? అనే అంశాలపై శాస్త్రవేత్తలు కీలక విషయాలను వెల్లడించారు.

డిసెంబర్‌లో ఎంట్రీ.. జూన్‌తో ఎగ్జిట్..
న్యూక్లియర్, ఎర్త్ సైంటిస్ట్ డాక్టర్ కేఎల్ సుందర్ కృష్ణ ఈ అంశంపై స్పందించారు. ఆదివారం నాడు ఏర్పడిన సూర్య గ్రహణం కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేయగలదని అన్నారు. గత సంవత్సరం డిసెంబర్‌లో సూర్య గ్రహణం ఏర్పడిన సమయంలోనే కరోనా మహమ్మారి ప్రపంచంపై దాడి చేసిందని .. జూన్ 21న ఏర్పడిన సూర్య గ్రహణంతో ఆ వైరస్ క్రియారహితంగా మరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
Recommended Video

సూర్యుడికి భూమికి మధ్య దూరం తగ్గితేనే..
రింగ్ ఆకారంలో ఏర్పడిన సూర్య గ్రహణంతో ఉపరితలం మరింత వేడేక్కె అవకాశం ఉందని.. దీంతో కరోనా వైరస్ అంతం ప్రారంభమవుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సూర్యుడు, భూమికి మధ్య 152.02 మిలియన్ల కిలోమీటర్ల దూరం ఉండగా.. ఆ దూరంగా కొంత మేర తగ్గితేనే కరోనా అంతం సాధ్యమవుతుందని మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications