సరైన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటా: రాహుల్

అన్ని వేళలా తన పెళ్లి గురించిన ప్రశ్న వస్తోందని, తాను ఎన్నికల పోరాటంలో ఉన్నానని, దురదృష్టవశాత్తు వ్యక్తిగత జీవితంపై తాను దృష్టి పెట్టలేకపోతున్నానని ఆయన పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు.
ఇప్పటి నుంచి రెండేళ్లా, ఏడాదా అనే విషయం చెప్పలేనని, సరైన అమ్మాయి లభిస్తే వివాహం చేసుకుంటానని ఆయన అన్నారు. అంటే, మీకు సరైన అమ్మాయి కనిపించలేదా అని అడిగితే సరైన అమ్మాయి కనిపించినప్పుడు పెళ్లి చేసుకుంటానని ఆయన సమాధానమిచ్చారు.
తాను కాల్పనికేతర సాహిత్యం చదువతానని, తన పనిపై దృష్టి పెడుతానని ఆయన చెప్పారు. చరిత్ర, భౌగోళిక శాస్త్రం, రాజకీయ వ్యవహారాలకు సంబంధిచిన పుస్తకాలు, మధ్య ప్రాచ్యం గురించి, అఫ్గనిస్తాన్, పాకిస్తాన్, చైనాల గురించి చదువుతానని ఆయన అన్నారు. మీ అభిమాన నటుడు ఎవరని అడిగితే, ఉత్తమ నటనను తాను అభిమానిస్తానని రాహుల్ గాంధీ జవాబిచ్చారు.












Click it and Unblock the Notifications