అవిశ్వాసం తీర్మానం నెగ్గుతుందా: ఎవరి బలం ఎంత?
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రివర్గం నిర్ణయం, సీమాంధ్ర ప్రాంత ఎంపీల అవిశ్వాస తీర్మానం నోటీసు నేపథ్యంలో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ విభజన రాజకీయాలు వేడెక్కాయి. సీమాంధ్ర కాంగ్రెసుకు చెందిన ఆరుగురు, తెలుగుదేశం ఎంపీలు నలుగురు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీలు ముగ్గురు వేర్వేరుగా అవిశ్వాసంపై నోటీసులు ఇచ్చారు.
వాటిని పరిగణలోకి తీసుకున్న స్పీకర్ మీరా కుమార్ లోకసభలో బుధవారం ప్రకటన చేశారు. తనకు మూడు నోటీసులు అందాయని చెప్పారు. అనంతరం సభలో గందరగోళం చెలరేగటంతో సభను రేపటికి వాయిదా వేశారు.

ఢిల్లీలో సీమాంధ్ర ఎంపీలు విభజన వేడిని రాజేస్తున్నారు. అవిశ్వాసం నేపథ్యంలో ఏ పార్టీ ఎవరికి మద్దతిస్తుందనే అంశంపై జోరుగా ఢిల్లీలో చర్చ జరుగుతోంది. అధికార పక్షం వైపు ఏ పార్టీ ఉంది, ప్రతిపక్షం వైపు ఏ పార్టీ ఉంది, తెలంగాణ పైన కాకుండా వేరే అంశంపైన అవిశ్వాస తీర్మానం వస్తే బిజెపి మద్దతు ప్రకటిస్తుందా? అనే చర్చ సాగుతోంది.
ఎవరి బలం ఎంత?
చర్చ జరిగి అవిశ్వాసం నెగ్గాలంటే 270 మంది మద్దతు అవసరం. సీమాంధ్ర ఎంపీలు అన్ని పార్టీలను కలిసి మద్దతు కూడగడుతున్నారు. 539 మంది సభ్యులో లోకసభలో ఉన్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే హాఫ్ మార్క్ (270) మంది మద్దతు అవసరం. అంతమంది సభ్యుల మద్దతు ఉండే అవకాశం లేదని, వీగిపోతుందంటున్నారు. ఈ వ్యవహారంలో బిజెపి వైఖరి కీలకంగా మారింది.
ప్రస్తుతం సభలో ఆయా పార్టీల బలాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ 206, ఎస్పీ 22, బిఎస్పీ 21, జెడియు 19, డిఎంకె 18, ఇండిపెండెంట్ 8, ఎన్సీపి 9, ఆర్ఎల్డీ 5, ఎన్సీ 3, ఆర్‌జెడి 3, ఐయుఎంఎల్ 2, జెఎంఎం 2, జెవిఎం 2, తెరాస 2, మజ్లిస్ 7, సిపిఐ 4, బిజెపి 115, టిఎంసి 19, సిపిఎం 18, బిజెడి 14, శివసేన 11, ఎఐడిఎంకె 9, టిడిపి 6, అకాళీదళ్ 4, ఫార్వర్డ్ బ్లాక్ 2, ఆర్ఎస్పీ 2, వైయస్సార్ కాంగ్రెసు 2, ఎఐయుడిఎఫ్ 1, ఎజిపి, జెడిఎస్ 2, ఎండిఎంకె 1, హెచ్‌జెసి, ఇండిపెండెంట్ 2గా ఉంది.
బయటి నుండి మద్దతిస్తున్న వారితో కలిపి యూపిఏకు 333 ఎంపీల మద్దతు ఉంది. ఇందులో ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెసు ఎంపీలు, జగన్ వైపు వెళ్లిన ఒక ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టినందన వారిని పక్కన పెడితే 326 అవుతుంది. అవుతుంది. ఇక ఎస్పీ(22) మద్దతిస్తే 304గా ఉంటుంది. ఇక తెలంగాణ అంశం పైన కాబట్టి బిజెపి అవిశ్వాసానికి మద్దతిచ్చే అవకాశం లేదు. దీంతో శివసేన, బిజెడి తదితర పార్టీలు మద్దతిచ్చినా అవిశ్వాసం నెగ్గే అవకాశం లేదు.












Click it and Unblock the Notifications