తమిళనాడుకు కాబోయే సీఎం రజనీకాంత్, ఆయన పార్టీకి నూటా యాభై సీట్లు!
చెన్నై: తమిళనాడులో ఓ సర్వే రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. దినమలర్ పత్రిక నిర్వహించిన సర్వేలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఏర్పాటు చేయబోయే పార్టీ ఘన విజయం సాధిస్తుందని తేలిందట. దీంతో అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలు కంగుతిన్నాయని అంటున్నారు.
కాలా సినిమా విడుదల అనంతరం రజనీకాంత్ అభిమానులతో మాట్లాడుతారని, అనంతరం రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారని అంటున్నారు.

ఆ పత్రిక చేసిన సర్వే ప్రకారం రజనీకాంత్ పార్టీకి 234 అసెంబ్లీ స్థానాలకు గాను 150 వచ్చే అవకాశముందని తేలింది. రజనీకాంత్ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకునే అవకాశాలున్నట్లు వెల్లడించింది.












Click it and Unblock the Notifications