"బ్రతికినా.. చచ్చినా.. మోడీని రాజకీయాల్లోంచి తరమికొడుతా"
'నేను చచ్చినా.. బ్రతికినా పర్వాలేదు కానీ మోడీని మాత్రం భారత రాజకీయాల నుంచి తరిమికొడుతా'అంటూ మమతా బెనర్జీ ప్రతిజ్ఞ చేశారు.
కోల్ కతా : ప్రధాని మోడీ తీసుకున్న నోట్ల రద్దు అంశాన్ని తొలి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. తాజాగా మోడీకి వ్యతిరేకంగా ప్రతినబూనారు. 'నేను చచ్చినా.. బ్రతికినా పర్వాలేదు కానీ మోడీని మాత్రం భారత రాజకీయాల నుంచి తరిమికొడుతా'అంటూ ప్రతిజ్ఞ చేశారు.
నోట్ల రద్దును నిరసిస్తూ ప్రతిపక్షాలన్ని నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో..కోల్ కతాలో జన్ ఆక్రోశ్ ర్యాలీని చేపట్టారు మమతా. ర్యాలీ సందర్బంగా మోడీని ఉద్దేశిస్తూ.. మమతా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మోడీని భారత రాజకీయాల నుంచి తరిమికొడుతానని మమతా చేసిన ప్రతిజ్ఞకు జనం నుంచి భారీ ఎత్తున హర్షద్వానాలు వినబడ్డాయి. మోడీ నియంతృత్వానికి ఇక కాలం చెల్లిందంటూ విరుచుకుపడ్డారు మమతా.

కాగా, దేశవ్యాప్తంగా నోట్ల రద్దుపై మోడీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న నేతల్లో మమతా పేరు బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ మోడీని అంతగా సవాల్ చేయలేకపోతుండడం.. విపక్షాల మధ్య ఐక్యత లేకపోవడం.. వంటి కారణాలు మమతా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసేందుకు దోహదం చేస్తున్నట్టుగా పలువురు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications