Solar eclipse 2020: కరోనా వైరస్‌కు చెక్ ఇలా..? ఏడాదిలో డెడ్‌లైన్, శాస్త్రవేత్త ఏ చెప్పారంటే..?
కరోనా వైరస్.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వైరస్ ఆవిర్భావంపై క్లారిటీ లేదు. కానీ వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు తమ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఈ లోపు ప్రపంచవ్యాప్తంగా వైరస్ సోకినవారు చనిపోతూనే ఉన్నారు. కానీ వైరస్ గురించి రోజుకో కొత్త విషయం బయటకొస్తోంది. తమిళనాడుకి చెందిన న్యూక్లియర్ అండ్ ఎర్త్ సైంటిస్ట్ డాక్టర్ సుందర్ కృష్ణ మాత్రం ఈ ఏడాదిలో కరోనా వైరస్ అంతమవుతోందని ధీమాగా చెబుతున్నాడు. అందుకు గల కారణం ఏంటో తెలుసుకుందాం పదండి.
Recommended Video

సూర్యగ్రహణంతోనే...
కరోనా వైరస్ చైనాలోని వుహాన్‌లో గతేడాది డిసంబర్‌లో బయటపడింది. అయితే సూర్య గ్రహణం సమయంలోనే వైరస్ ఆవిర్భవించిందని సుందర్ కృష్ణ చెబుతున్నారు. గ్రహణం తర్వాత విడుదలయ్యే శక్తి వల్ల తొలి న్యూట్రాన్ పరివర్తణ చెంది కణ సంక్రమణ తర్వాత కరోనావైరస్ ప్రభావం మొదలైందని చెప్పారు. డిసెంబర్ 26వ తేదీ తర్వాత సౌర వ్యవస్థలో కొత్త అమరికతో గ్రహ ఆకృతీకరణ జరిగిందని అంచనా వేశారు. సూర్యగ్రహణం రోజునే వైరస్ ఆవిర్భవించినందున.. సూర్యగ్రహణం రోజునే అంతమవుతోందని వివరించారు.

ఇలా వ్యాప్తి..
ఇంటర్ ప్లానెటరీ పోర్స్ వైవిధ్యత వల్ల సూర్యరశ్మి నుంచి వైరస్ వ్యాపించిందని, వైరస్ వ్యాప్తికి భూమి అనుకూలమైన ప్రాంతం అని తెలిపారు. వాతావరణంలో బయో న్యూక్లియర్ ఇంటరాక్షన్ వల్ల జీవాణువుల నిర్మాణం వల్ల వైరస్ వ్యాపించిందనన్నారు. 2020 ఏడాదిలో వచ్చే సూర్యగ్రహణంతోనే వైరస్ అంతమవుతోందని పేర్కొన్నారు. సూర్యుని నుంచి వచ్చిన కాంతి తరంగాలు.. క్రమంగా అలానే నాశనమయ్యే అవకాశం ఉంది అని పేర్కొన్నారు.

భయపడొద్దు
గ్రహణాలు, వైరస్ ఆవిర్భావాలు సహజంగా ఏర్పడే ప్రక్రియ అని సుందర్ కృష్ణ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని శ్రీ కృష్ణుడు ఎప్పుడో చెప్పాడని పేర్కొన్నారు. సహజమైన ప్రక్రియను చూసి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు అని సూచించారు. సూర్యరశ్మి, సూర్యగ్రహణం ద్వారా వైరస్‌ను సమూలంగా నివారిస్తోందని తెలిపారు. మరీ శాస్త్రవేత్త అభిప్రాయాన్ని.. ఇతర నిపుణులు ఏమంటారో చూడాలి మరీ.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications