వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీట్ వేవ్, బొగ్గు కొరతతో భారత్‌లో కరెంట్ కష్టాలు మరింత తీవ్రమవుతాయా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
విద్యుత్ ఉత్పత్తిలో మూడు వంతులు బొగ్గు ద్వారానే తయారవుతుంది

దేశ రాజధాని దిల్లీకి పక్కనే ఉండే ఫరీదాబాద్‌లో సందీప్ మాల్‌ అనే పారిశ్రామికవేత్త ఇంజినీరింగ్ గూడ్స్ ఫ్యాక్టరీ నడుపుతున్నారు. ఒక్కోసారి ఆయన ఫ్యాక్టరీ రోజులో 14 గంటలపాటు విద్యుత్ కోతలను ఎదుర్కొంటోంది.

ఆయన ఫ్యాక్టరీలో దాదాపు 50 యంత్రాలు ఉంటాయి. ఏరోనాటిక్స్, ఆటోమొబైల్, మైనింగ్, నిర్మాణ పరిశ్రమల కోసం అవసరమైన వస్తువులను ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తుంది.

"కరెంటు పోయిన ప్రతిసారీ మెషిన్లు ఆగిపోతాయి. పూర్తిగా తయారుకాని వస్తువులను ఎవరూ తీసుకోరు. మేం వాటిని మళ్లీ తయారు చేయాల్సి ఉంటుంది'' అన్నారు సందీప్ మాల్.

తన ఫ్యాక్టరీని నడిపించడానికి అప్పుడప్పుడు ఆయన డీజిల్ పవర్ జనరేటర్‌లను వాడాల్సి ఉంటుంది. అయితే, కరెంటు వాడినప్పటికన్నా, డీజిల్‌తో నడపడం వల్ల ఖర్చు మూడు రెట్లు ఎక్కువ అవుతోందని ఆయన చెప్పారు.

"ఈ పరిస్థితుల వల్ల నేను మార్కెట్‌లో పోటీ పడలేను. నా లాభాలు తగ్గుతాయి. పరిస్థితి గందరగోళంగా ఉంది'' అన్నారు సందీప్. "ఈ దశాబ్దం కాలంలో నేను చూస్తున్న అత్యంత చెత్త కరెంటు సరఫరా ఇది" అన్నారాయన.

ఏప్రిల్ నుండి, భారతదేశం అంతటా విద్యుత్ కోతలు, అంతరాయాలు మొదలయ్యాయి. ఫ్యాక్టరీలలో పనులు కుంటు పడుతున్నాయి. చాలాచోట్ల ప్రజలు ఆందోళనలకు కూడా దిగారు.

లోకల్‌ సర్కిల్స్ అనే పోలింగ్ ఏజెన్సీ దేశంలోని 322 జిల్లాల్లో 21,000 మందికి పైగా ప్రజలపై సర్వే నిర్వహించింది. ప్రతి మూడు ఇళ్లలో రెండు ఇళ్లు కరెంటు కోతలను ఎదుర్కొన్నట్లు ఈ సర్వే వెల్లడించింది.

ప్రతి మూడు కుటుంబాలలో ఒక కుటుంబానికి కనీసం రెండు గంటలు, అంతకంటే ఎక్కువ సమయం కరెంటు కోతలు ఎదురైనట్లు తెలిపింది.

సందీప్ మాల్ ఫ్యాక్టరీ ఉన్న హరియాణ రాష్ట్రంతో సహా కనీసం తొమ్మిది రాష్ట్రాలు సుదీర్ఘమైన కరెంటు కోతలతో ఇబ్బంది పడుతున్నాయి. ఈ కోతలకు ప్రధాన కారణం బొగ్గు కొరత.

ఫరీదాబాద్ లో తన ఫ్యాక్టరీకి ఒక్కరోజు కూడా కోతల్లేకుండా విద్యుత్ అందలేదని సందీప్ మాల్ అన్నారు

బొగ్గు సమస్య

భారతదేశం ప్రపంచంలోనే రెండో అతి పెద్ద బొగ్గు ఉత్పత్తిదారు, అలాగే వినియోగదారు కూడా. దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో మూడు వంతులు బొగ్గు నుంచే వస్తుంది. అత్యధిక బొగ్గు నిల్వలున్న దేశాలో ఇండియా మూడో స్థానంలో ఉంది.

ప్రపంచంలోనే అతి పెద్ద మైనింగ్ కంపెనీ ఉన్నట్లుగా దేశం చెప్పుకుంటుంది. కానీ, వ్యక్తిగత వినియోగంలో ఇంకా వెనకబడే ఉంది.

వినియోగించే బొగ్గులో పావు వంతుకంటే తక్కువ బొగ్గును ఇండియా దిగుమతి చేసుకుgటుంది. ఇందులో ఎక్కువగా కోకింగ్ బొగ్గు ఉంది. ఈ కోకింగ్ బొగ్గును ఉక్కు కంపెనీల్లో బ్లాస్ట్ ఫర్నేస్‌లలో ఉపయోగిస్తారు. దేశీయంగా ఇది అందుబాటులో ఉండదు. ఇది నిత్యం కొరత సమస్య ఎదుర్కొంటుంది.

గత అక్టోబర్‌లో, దేశంలోని 135 బొగ్గు ఆధారిత ప్లాంట్‌లలో సగానికి పైగా ప్లాంట్లలో బొగ్గు నిల్వలు చాలా తక్కువగా లేదా సాధారణ స్థాయిల కంటే 25% కంటే తక్కువగా ఉన్నాయి. ఆ సమయంలో భారతదేశం విద్యుత్ సంక్షోభానికి చేరువైంది.

ఇప్పుడు 173 పవర్ ప్లాంట్లలో 108 ప్లొంట్లలో బొగ్గు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. యుక్రెయిన్‌లో యుద్ధంతో అంతర్జాతీయంగా బొగ్గు, సహజ వాయువుల ధరలు పెరిగాయి, దిగుమతుల ఖర్చు బాగా పెరిగింది.

"డిమాండ్ ఎక్కువగా ఉన్నందున ఈ సంక్షోభం గత సంవత్సరం కంటే దారుణంగా ఉంది. ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి " అని సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్‌ సంస్థలో సీనియర్ ఫెలో రాహుల్ టోంగియా చెప్పారు. ఇది దిల్లీ కేంద్రంగా పని చేసే థింక్ ట్యాంక్.

దీనికితోడు దేశంలో హీట్ వేవ్ ఊహించిన దానికంటే ముందుగానే వచ్చింది. ఉత్తర, మధ్య భారతదేశాలలో ఏప్రిల్ నెలలోనే సగటు ఉష్ణోగ్రతలు 120 సంవత్సరాలలోనే అత్యధికంగా నమోదయ్యాయి. విద్యుత్ డిమాండ్‌ను రికార్డు స్థాయికి చేరింది.

రెండు సంవత్సరాల మహమ్మారి లాక్‌డౌన్ల తర్వాత ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడటంతో విద్యుత్ డిమాండ్ కూడా పెరిగింది. అలాగే, భారతీయ రైల్వేలు షేర్డ్ ట్రాక్‌ల పై ప్రయాణికుల రైళ్లను ఎక్కువ నడపడంతో బొగ్గు రవాణాకు అంతరాయం కలిగింది.

''భారతదేశంలో పూర్తిగా బొగ్గు కొరత ఉందని అనుకోవడం సరికాదు. నిల్వలు తక్కువ కావడం కొత్త విషయం కాదు. కొరత, రవాణాల మేనేజ్‌మెంట్ కోసం మన దగ్గర ఒక వ్యవస్థ ఉంది. కాకపోతే ఇది సామర్ధ్యం కోసం లేదా రిస్క్ మేనేజ్‌మెంట్‌లను నిర్వహించడంలో ఉపయోగపడటం లేదు'' అని టోంగియా చెప్పారు.

విద్యుత్తు డిమాండ్ కాలానుగుణంగా ఉంటుంది. ఒక నిల్వను పెంచుకోవడం ఖర్చుతో కూడుకున్న పని అని,అలాగే సమయం తీసుకుంటుందని నిపుణులు అంటున్నారు.

ఇండియాలో హీట్‌వేవ్ ఈసారి త్వరగా వచ్చింది

పెరిగిన దిగుమతులు

భారతదేశం సంప్రదాయకంగా బొగ్గును దిగుమతి చేసుకోవడం ద్వారా సరఫరాలను బలోపేతం చేసింది. ''నెలల తరబడి కొనసాగుతున్న కొరతను, ఎక్కువ సరఫరా ద్వారా పరిష్కరించడం సాధ్యం కాదు'' అని టోంగియా అన్నారు.

ప్లాంట్లకు బొగ్గు సరఫరా అందేలా అన్ని విధాలా కృషి చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.

కేంద్ర ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం, ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు గనుల సంస్థ అయిన కోల్ ఇండియా తన ఉత్పత్తిని 12% పెంచింది. ఏప్రిల్‌లో 49.7 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గును విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు పంపింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 15% ఎక్కువ.

ఇంధన కొరత ఉన్న ప్లాంట్లకు మరింత బొగ్గును రవాణా చేసేందుకు రైల్వే వెయ్యికి పైగా ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బొగ్గు పుష్కలమైన ఆదాయాన్ని అందిస్తుంది. కానీ, భారతదేశంలో బొగ్గు, విద్యుత్ మధ్య సంబంధం అన్ని సమయాల్లో ప్రయోజనకరంగా ఉండటం లేదని సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్‌ లో ఎనర్జీ ఎక్స్‌పర్ట్ దల్జీత్ సింగ్ అన్నారు.

భారతదేశంలోని పవర్ ప్లాంట్లు బొగ్గును రకరకాల ధరలకు కొనుగోలు చేస్తుంటాయని ఆయన అన్నారు. ప్లాంట్ ప్రైవేట్‌దా, ప్రభుత్వానిదా, అది ఎప్పుడు స్థాపించారు, అది కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలేంటి అనే వాటిపై అది బొగ్గు కొనే రేటు ఆధారపడి ఉంటుంది.

పక్కపక్కనే ఉండే ప్లాంట్లు కూడా రెండు రకాల ధరలకు బొగ్గును కొంటున్న సందర్భాలున్నాయని, ఈ కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

''ప్రభుత్వ యాజమాన్యంలోని పవర్ ప్లాంట్‌లకు ఈ విధానాలు అనుకూలంగా ఉన్నాయి'' అని దల్జీత్ సింగ్ చెప్పారు.

భారతీయ రైల్వేలు ప్రయాణికులపై ఛార్జీలు తగ్గించడానికి, బొగ్గు రవాణా పై అధిక ఛార్జీల భారాన్ని వేస్తుంటాయని, ఇది చిన్న ఉదాహరణ మాత్రమేనని టోంగియా అన్నారు.

భారతదేశపు బొగ్గులో బూడిద శాతం ఎక్కువని నిపుణులు చెబుతున్నారు

పునరుద్పాదకత భర్తీ చేయగలదా?

బొగ్గు పై ఆధారపడకుండా ఉండేందుకు 2030 నాటికి పునరుత్పాదక-శక్తి సామర్థ్యాన్ని 450 గిగావాట్లకు పెంచుతామని భారతదేశం వాగ్దానం చేసింది. అయితే, బొగ్గు స్థానంలో పునరుత్పాదక ఇంధనాల పెంచడం ఒక్కటే సరిపోదని, బొగ్గును పూర్తిగా నిలిపేయడం కన్నా, శుద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని టోంగియా అన్నారు.

భారతదేశపు బొగ్గులో బూడిద ఎక్కువగా ఉంటుంది. మిగతా వాటితో పోలిస్తే దాదాపు 35% ఎక్కువ కాలుష్యానికి కారణమవుతుంది. గ్రీన్‌పీస్ అంచనాల ప్రకారం బొగ్గు ఉద్గారాల కారణంగా ప్రతి సంవత్సరం లక్షమంది కంటే ఎక్కువ చనిపోతున్నారని టోంగియా అన్నారు.

ఇక మనం తిరిగి ఫరీదాబాద్‌లోని సందీప్ మాల్ ఫ్యాక్టరీ వద్దాం. ఈ ఫ్యాక్టరీ 27 సంవత్సరాల కిందట ప్రారంభమైనా, ఒక్కరోజు కూడా నిరంతరాయంగా విద్యుత్‌ను పొందలేకపోయింది. ఇక ఇప్పుడు మొదలైన కోతలు మరింత ఇబ్బందికి గురి చేస్తున్నాయి.

"వ్యాపారం చేసే విధానం మాత్రం కాదు. మేం ఉద్యోగాలు సృష్టిస్తున్నాం, పన్నులు కడుతున్నాం. మాకు లభించేది ఇదేనా '' అని సందీప్ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Will the current crisis in India be exacerbated by heat wave and coal shortages
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X