వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్డినెన్స్: కాంగ్‌వైపు నితీష్, రాహుల్‌కు సోనియా ప్రశంస

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Will UPA find new ally in JD(U)?
న్యూఢిల్లీ: నేర చరితుల ఆర్డినెన్స్ పైన కాంగ్రెసు పార్టీ వెనక్కి తగ్గడాన్ని జెడి(యు) స్వాగతించింది. ఆర్డినెన్స్ ఉపసంహరణపై పార్టీకి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. ఎన్డీయో నుండి వైదొలిగిన అనంతరం కాంగ్రెసుతో పొత్తుపై జెడి(యు) మొదటిసారి బహిరంగ ప్రకటన చేసింది. లోకసభలో జెడి(యు) ఇరవై మంది సభ్యులు ఉన్నారు. కాగా, జెడి(యు) తాజా ప్రకటనతో 2014 ఎన్నికల్లో కాంగ్రెసుతో వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆర్డినెన్స్‌పై యుపిఏ మిత్ర పక్షాల ఆగ్రహం

ఆర్డినెన్స్ విషయంలో యూపిఏ మిత్ర పక్ష పార్టీ నేతలైన శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాలు కాంగ్రెసు తీరును తప్పు పట్టారు. ఆర్డినెన్స్‌పై డ్రామా దురదృష్టకరమని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఆర్డినెన్స్ విషయంలో ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ బహిరంగంగా మాట్లాడటం సరికాదన్నారు.

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వచ్చే వరకు నిరీక్షించి, ఆయన దృష్టికి తీసుకు వెళ్లవలసి ఉండెనని అభిప్రాయపడ్డారు. రాహుల్ భవిష్యత్తులో అలా నిర్ణయాలు ఇస్తారని భావిస్తున్నానన్నారు.

స్వాగతించిన బిజెపి, లెఫ్ట్

ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవడం తమ పార్టీ ఘనతేనని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు చెప్పారు. ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోవడాన్ని బిజెపి, లెఫ్ట్ పార్టీలు స్వాగతించాయి. ఆర్డినెన్స్ విషయంలో రాహుల్ గాంధీ వైఖరిని తృణమూల్ కాంగ్రెసు తప్పు పట్టింది. డ్రామాగా ఎఎపి పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.

రాహుల్‌కు సోనియా ప్రశంసలు

కోర్ కమిటీ భేటీలో ఆర్డినెన్స్ విషయమై చర్చకు వచ్చినప్పుడు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తన తనయుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పొగడ్తలతో ముంచెత్తినట్లుగా తెలుస్తోంది.

English summary
In a big political move, the JD(U) has openly pledged its support to Congress after its decision to withdraw the Congress. JD(U) spokesperson told Times Now, “We have always been against the ordinance. We support this move.” However, when asked if they will support UPA as an ally, he said, “We are against communal forces coming to power.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X