మళ్లి గాల్లోకి ఎగరనున్న వింగ్ కమాండర్ అభినందన్, ఇప్పుడు ఏ యుద్ద విమానమో తెలుసా..?
Recommended Video
బాలాకోట్ దాడి తర్వాత పాకిస్థాన్‌కు బంధి అయిన తర్వాత అనుహ్యంగా భారత్‌కు చేరుకున్న వింగ్ కమాండర్ వర్థమాన్ అభినందన్ మరోసారి తన సత్తాను చాటేందుకు మిగ్ విమానాల పైలట్‌గా మారనున్నారు. ఆయన మరోసారి యుద్ద విమానాలను నడిపేందుకు ఫిట్‌నెస్ కల్గి ఉన్నాడని బెంగళూరులో ఉన్న ఎయిరో స్పేస్ ఇన్సిటిట్యూట్ సర్టిఫై చేసింది. దీంతో మరో పదిహేను రోజుల్లో మిగ్ 21 ఫైటర్‌లో విధులు నిర్వహించనున్నాడు.
పుల్వామా దాడి పరిణామాల తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన బాలాకోట్‌పై ఎయిర్ స్ట్రైక్ నిర్వహించింది. తదనంతరం ఫిబ్రవరి 27న ఎఫ్ 16 విమానాల ద్వార పాకిస్థాన్‌లోకి ప్రవేశించిన వింగ్ కమాండ్ అభినందన్ విమానం కూలిపోయి పాకిస్థాన్‌కు పట్టుబడ్డాడు. అనంతరం భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించడంతో అభినందన్ తిరిగి భారత దేశానికి చేరుకున్న విషయం తెలిసిందే.

కాగా భారత చట్టాల ప్రకారం వర్థమాన్‌కు పలు పరీక్షలు నిర్వహించారు. శత్రు దేశానికి పట్టుపడడంతో పలు పరీక్షలు నిర్వహించిన తర్వాత మళ్లి ఆయన్ను ఉద్యోగంలోకి తీసుకున్నారు. దీంతో కొద్ది నెలల పాటు అభినందన్ తన పాత విధులకు దూరంగా ఉన్నాడు. కాగా ప్రస్థుతం శ్రీనగర్ ఎయిర్‌బేస్ లో ఉద్యోగం చేస్తున్న అభినందన్ కశ్మీర్ వ్యాలీలో నెలకోన్న భద్రత వ్యవహారాల్లో పాలుపంచుకుంటున్నాడు. పదిహేను రోజుల తర్వాత తిరిగి తన పాత విధుల్లోకి చేరేందుకు అభినందన్‌కు సిద్దమవుతున్నాట్టు ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications