జమిలి పై కేంద్రం బిగ్ అప్డేట్ - గేమ్ షురూ..!!
మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచిన జోష్ లో ఉన్న బీజేపీ నాయకత్వం సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. నేటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జమిలి తో పాటుగా వక్ఫ్ (సవరణ) బిల్లు ప్రవేశ పెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఆదానీ అంశం పైన నిలదీసే లా విపక్ష ఇండియా కూటమి సిద్దమైంది. మణిపూర్ పైన ప్రభుత్వాన్ని టార్గెట్ చేయనున్నారు. ఇదే సమయంలో అధికార పక్షం సైతం మొత్తం 16 బిల్లుల ఆమోదానికి రంగం సిద్దం చేసింది. దీంతో, ఈ సమావేశాలు వాడి వేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది.
నేటి నుంచి సమావేశాలు
ఈ రోజు నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల అజెండా పై కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశాల్లో అదానీ అవినీతిపై చర్చించాల ని.. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాల్సిందేనని ప్రతిపక్ష కూటమి ప్రభుత్వం పై ఒత్తిడి చేస్తోంది. అదానీ వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమావేశాల్లో 16 బిల్లులు ప్రవేశ పెట్టనున్నట్లు ప్రభుత్వం పార్టీలకు సమాచారం ఇచ్చింది. ఈ సమావేశాలు డిసెంబర్ 20 వరకు జరగనున్నాయి. నవంబర్ 26న 75వ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా సంవిధాన్ సదన్ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో నిర్వ హించ నున్నట్లు కేంద్రం వెల్లడించింది.

ఆదానీ రగడ
వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) ఈ నెల 29న తన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించే అవకాశం ఉంది. మణిపూర్‌లో ఇటీవల మళ్లీ చోటుచేసు కున్న అల్లర్లు, ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో అవకతవకలు, వక్ఫ్ బిల్లుపై చర్చించేందుకు వీలుగా పార్లమెంటరీ బిజినెస్‌లో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమావేశాల్లోనే కేంద్రం మరికొన్ని బిల్లులను ప్రవేశ పెట్టే ఆలోచనలో ఉంది. మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపుతో జోష్‌లో ఉన్న ఎన్డీయే జమిలి ఎన్నికలపైనా కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ సమావేశాల్లోనే జమిలి బిల్లు ప్రవేశ పెడతారని తెలుస్తోంది. ఇందు కోసం మూడు బిల్లులు పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. ప్రతిపక్షం మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది.
జమిలి నిర్ణయంతో
మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం పార్లమెంట్ సమావేశాల ముందు బీజేపీ నాయకత్వంలో కొత్త జోష్ తీసుకొచ్చింది. పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ మరింత దూకుడును ప్రదర్శించే అవకాశం ఉంది. ప్రధాని మోదీ నేతృత్వంలో మరిన్ని కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నేతల సమాచారం. జమిలి ఎన్నికలపైనా ఉభయ సభల్లో చర్చ జరగనుందని ముఖ్య నేతలు చెబుతున్నారు. దీంతో, వచ్చే జనవరి నుంచి జనగణన, డీ లిమిటేషన్ వంటివి పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో.. జమిలి పైన ఈ సమావేశాల్లోనే బిల్లు ఆమోదిస్తే 2027లోనే ఎన్నికలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో కేంద్ర నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు సైతం సమావేశాల్లో తమ డిమాండ్ల ను అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం ముందు ఉంచారు.












Click it and Unblock the Notifications