• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేశంలో కొంత మేర తగ్గిన కరోనా వ్యాప్తి: 24గంటల్లో 1007 కొత్త కేసులు, 23 మరణాలు

|

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలతో పోలిస్తే మనదేశం కరోనాను ఎదుర్కోవడంలో ఎంతో మెరుగ్గా ఉందని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. దేశంలో కరోనా కేసుల పెరుగుదలలో క్రమంగా తగ్గుదల నమోదవుతోందని తెలిపారు. శుక్రవారం లవ్ అగర్వాల్ మీడియాకు కరోనా వివరాలను వెల్లడించారు.

America shutdown: మూడు దశల్లో రీఓపెన్, కీలక మార్గదర్శకాలు, ట్రంప్ తగ్గారు!

24 గంటల్లో 1007 కేసులు, 23 మరణాలు

24 గంటల్లో 1007 కేసులు, 23 మరణాలు

దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,007 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 23 మరణాలు సంభవించాయయని వైద్యారోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,387 చేరాయని, మొత్తం మరణాల సంఖ్య 437కు చేరిందని తెలిపారు. కరోనా బారినపడిన 1749 మంది కోలుకున్నారని తెలిపారు. ఇది 13.06శాతంతో సమానమని చెప్పారు.

24 నమూనాల్లో 1 పాజిటివ్..

24 నమూనాల్లో 1 పాజిటివ్..

ప్రతి 24 నమూనాళ్లో 1 కరోనా పాజిటివ్ కేసు నమోదవుతోందని అగర్వాల్ వెల్లడించారు. లాక్‌డౌన్‌కు ముందు దేశంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అవ్వడానికి కేవలం మూడు రోజులు మాత్రమే పట్టేదని.. అయితే, లాక్‌డౌన్ కాలంలో గత రోజుల డేటాను పరిశీలిస్తే కేసుల రెట్టింపునకు కనీసం 6.2 రోజులు పడుతోందని వివరించారు. 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేసుల రెట్టింపు సరాసరి జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని చెప్పారు.

ఇతర దేశాలతో పోలిస్తే మెరుగ్గా..

ఇతర దేశాలతో పోలిస్తే మెరుగ్గా..

కేరళ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, హర్యానా, ఢిల్లీ, బీహార్, ఒడిశా, తమిళనాడు, తదితర రాష్ట్రాలు జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నాయన్నారు.

కరోనా కారణంగా కోలుకుంటున్న వారి సంఖ్య , మరణిస్తున్న వారి నిష్పత్తి 80:20గా ఉందని అగర్వాల్ వివరించారు. ఇతర దేశాలతో పోలిస్తే మనం చాలా మెరుగ్గానే ఉన్నామని తెలిపారు.

ఇండియాలో కరోనా ప్రభావం..

ఇండియాలో కరోనా ప్రభావం..

కాగా, ఇప్పటి వరకు 5 లక్షల యాంటీబాడీ టెస్ట్ కిట్లను రాష్ట్రాలకు అందజేసినట్లు వివరించారు. దేశ వ్యాప్తంగా ప్రత్యేక 1919 కరోనా ఆస్పత్రుల్లో 1.73 లక్షల ఐసోలేషన్ బెడ్లు, 21,800 ఐసీయూ బెడ్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 3,19,400 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, గురువారం ఒక్కరోజే 28,340 టెస్టులు నిర్వహించామని వివరించారు. ఇండియాలో కరోనా వైరస్ ప్రభావం ఒక రకంగా తక్కువగానే ఉందని, దేశం నుంచి కరోనాను పూర్తిగా పారద్రోలేందుకు మార్గం సుగమమవుతోందని తెలిపారు.

    Fake News Buster : 07 'హెలికాఫ్టర్ నుంచి ప్రజలకు డబ్బులు జారవిడుస్తున్న ప్రభుత్వం' ఇందులో నిజమెంత ?

    English summary
    With 1007 new cases, India's corona count reaches 13,387, death toll at 437.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X