మళ్లీ పెరిగిన బంగారం ధరలు... ఇలా అయితే కొనడం కష్టమే..!
Recommended Video
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో బంగారం, మరియు వెండి ధరలకు రెక్కలొచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యంతో బంగారు ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. అంతేకాదు డాలరుతో పోలిస్తే రూపాయి విలువ పతనం కావడం కూడా పసిడి ధరల పెరుగుదలకు కారణమైంది. ఎంసీఎక్స్‌లో బంగారం ధర 0.42శాతం పెరిగి రూ. 39,109కి చేరింది. ఇక వెండి ధరలు రికార్డు స్థాయిలో రూ. 48,970కి చేరింది. 0.5శాతం పెరుగుదల కనిపించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.72.37గా ఉంది.గత వారం 10 గ్రాముల బంగారం ధర రూ. 39,425గా ఉన్నింది.

బంగారం పై పెరిగిన పెట్టుబడులు
ప్రపంచ మార్కెట్లలో ఔన్సు పుత్తడి ధర 0.3శాతం పడిపోయి 1,525 డాలర్లకు చేరుకుంది. గత వారం ఔన్సు బంగారం ధర 1,554.56 డాలర్లుగా ఉన్నింది. ఇది గత ఆరేళ్లలో ఎప్పుడూ ఈ స్థాయిలో బంగారం ధరలు లేవు. ఈ ఏడాదిలో బంగారం ధరలు దాదాపు 20శాతం పెరిగాయి. అంతేకాదు బంగారం పై పెట్టుబడులు కూడా పెరిగాయి. అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్దం జరుగుతుండటంతో ఈక్విటీలు, ఇక ఆయాదేశాల సెంట్రల్ బ్యాంకులు ప్రవేశపెట్టిన ద్రవ్య పరపతి విధానాలతో బంగారం ధరల పెరుగుదలకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక గోల్డ్‌మ్యాన్ శాక్స్, యూబీఎస్ గ్రూపుల్లో పనిచేసే అనలిస్టులు మాత్రం భవిష్యత్తులో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

2013 తర్వాత తొలిసారిగా బంగారంపై పెరిగిన పెట్టుబడులు
ఇక బంగారంపై పెట్టుబడులు వెల్లువ నడుస్తోందని ఈటీఎఫ్ పేర్కొంది. ఒక్క ఆగష్టులోనే 100 టన్నుల బంగారంపై పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. 2013 ఫిబ్రవరి తర్వాత ఈ స్థాయిలో బంగారంపై ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయడం ఇదే తొలిసారని బ్లూంబర్గ్ నివేదిక వెల్లడిస్తోంది. మదుపరులు తమ ఆస్తుల్లో నుంచి 10శాతం బంగారం కోసం కేటాయింపులు చేయాలని వెటరన్ ఇన్వెస్టర్ మార్క్ మోబియస్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే వాణిజ్య యుద్ధంలో భాగంగా చైనా వస్తువులపై 15శాతం సుంకాన్ని ఆదివారం నుంచి విధించగా... చైనా కూడా అమెరికా ముడి చమురుపై కొంత సుంకాన్ని విధించింది. అంతేకాదు అమెరికాపై వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చైనా ప్రకటించింది.

పండగ సీజన్‌లో మరింత పెరిగనున్న పసిడి ధరలు
భారత్ విషయానికొస్తే రానున్న పండగ సీజన్‌లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నగల దుకాణాల యజమానులు భావిస్తున్నారు. అధిక ధరల కారణంగా బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది వెనకాడుతున్నారని... అయితే పండగ సీజన్ కాబట్టి కచ్చితంగా కొనుగోలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక దేశీయంగా బంగారంపై 12.5శాతం దిగుమతి సుంకం మరియు 3శాతం సేల్స్ ట్యాక్స్ విధించడం జరుగుతోంది. ఇక రూపాయి విలువ కూడా 3.5 శాతం పడిపోవడం కూడా బంగారం ధరలకు రెక్కలొచ్చేలా చేశాయి. ఇక జూలైలో దిగుమతి సుంకం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పుత్తడి ధరలు ఆకాశాన్నంటాయి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications