‘సొంత మతంలోకి తీసుకొస్తాం’: బీజేపీ ఎంపీ తేజస్వి యాదవ్ సంచలనం, ఆ తర్వాత వెనక్కి

బెంగళూరు: బెంగళూరు సౌత్ ఎంపీ, బీజేపీ నేత తేజస్వీ సూర్య సంచలన వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత వెనక్కి తగ్గారు. హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి మారిన వారిని తిరిగి సొంతమతంలోకి రప్పిస్తామన్నారు తేజస్వి సూర్య. వీడియో వైరల్ కావడంతో తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీ కాకూడదని కాసేపటికే విరమించుకుంటున్నట్లు తెలిపారు.

ముందుగా మాట్లాడినప్పుడు ప్రతి గుడి, మఠం టార్గెట్ పెట్టుకుని హిందూ మతం నుంచి ఇతర మతంలోకి మారిన వాళ్లను తిరిగి హిందూయిజంలోకి తీసుకురావాలని తేజస్వి సూర్య అన్నారు. ఉడిపి శ్రీ కృష్ణ మఠ్ వేదికగా జరిగిన కార్యక్రమంలో భారతంలో హిందువుల పునరుజ్జీవనం అంశంపై మాట్లాడాను. ఆ కామెంట్లు కాంట్రవర్సీని క్రియేట్ చేస్తున్నాయని తెలిసి.. వాటిని ఉపసంహరించుకుంటున్నా అని తేజస్వి సూర్య స్పష్టం చేశారు.

 Withdraws Hindu Revival comments: Tejasvi Surya After Viral Video

కాగా, అంతకుముందు 'కేవలం ముందున్న ఆప్షన్ ఏంటంటే.. కన్వర్ట్ అయిన హిందువులు రీ కన్వర్ట్ అయి సొంత మతంలోకి రావాలి. సహజంగా జరగకపోయినా ఇప్పుడు మనం మాత్రం కలవాల్సిందే. ఇది మన డీఎన్ఏ' అని తేజస్వీ సూర్య అన్నారు.

డిసెంబర్ 25న కర్ణాటకలోని ఉడిపి కేంద్ర మాట్లాడిన తేజస్వి సూర్య.. రీ కన్వర్షన్ అనేది సహజంగా జరగకపోయినా.. హిందువులు మాత్రం మమేకం కావాల్సిన సమయమిది. పుట్టిన మతంలోకి మారిన వారందరినీ తిరిగి తీసుకురావాలని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకొచ్చిన కొద్ది రోజులకే ఈ కామెంట్లు చేయడం చర్చనీయాంశంగా మారాయి, తన ప్రసంగం వీడియోలు వైరల్ కావడం, పలు వర్గాల నుంచి విమర్శలు రావడంతో తేజస్వి సూర్య తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+