ఎత్తుకెళ్లి తుపాకితో బెదిరించి అమ్మాయిపై గ్యాంగ్ రేప్

మీరట్: ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నలుగురు యువకులు ఓ యువతి(22)ని ఎత్తుకెళ్లి తుపాకీతో బెధిరించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక్కడి దౌరాలా ప్రాంతానికి చెందిన ఆమెను ఈ నెల 25న బలవంతంగా ఎత్తుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు.
ఈ విషయం బయటపెడితే కుటుంబం మొత్తాన్ని హతమారుస్తామంటూ బాధితురాలిని బెదిరించి ఆ మరుసటి రోజు విడిచిపెట్టారని చెప్పారు. కాలకృత్యాల కోసం బాధితురాలు సమీపంలోని అడవుల్లోకి వెళ్లినప్పుడు ఆమె వారి బారిన పడింది. ఈ నెల 25వ తేదీన ఆ సంఘటన జరిగింది. బహర్భూమికి వెళ్లిన ఆమెను ఎత్తుకెళ్లి ఖాళీ ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెపై దారుణానికి పాల్పడ్డారు.

Woman abducted, gang raped by four youths at gunpoint in Meerut

ఎవరికైనా చెప్తే కుటుంబాన్ని హతుమారుస్తామని ఆమెను మర్నాడు నిందితులు వదిలిపెట్టారు. అయితే, ఆమె విషయాన్ని తన కటుంబ సభ్యులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. నిందితులను అమిత్, వికాస్, బల్కార్, అంకిత్‌గా గుర్తించారు. అమ్మాయిని వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలు తీవ్ర కలవరం కలిగిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+