పబ్లిక్ గా ఇంట్లో నుంచి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్ (హరియాణా)లో ఘోరం జరిగింది. అందరూ చూస్తుండగానే ఓవివాహితను ఇంట్లోంచి బయటకు లాక్కెళ్లి బైక్ లో తీసుకు వెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు.
సామూహిక అత్యాచారం చేసిన కామాంధుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. గురుగ్రామ్ లోని బద్దాపూర్ లో 29 ఏళ్ల వివాహిత నివాసం ఉంటున్నారు. ఈమె తండ్రి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు.
ఉదయం తండ్రి ఉద్యోగానికి వెళ్లారు. తల్లి ఆసుపత్రికి వెళ్లింది. ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్నారు. ఆ సమయంలో ముగ్గురు దుండగులు ఇంట్లో చొరబడ్డారు. వివాహితను బయటకు లాక్కెళ్లారు. ఆమెను బైక్ లో తీసుకెళ్లారు.

ఆ సందర్బంలో చుట్టుపక్కల వారు చూస్తున్నారే తప్ప, కనీసం అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. ఆమెను మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ మీదకు తీసుకు వెళ్లి మరుసటి రోజు వరకూ సామూహిక అత్యాచారం చేశారు.
తరువాత ఆమెను వదిలి పెట్టారు. ఇంటికి వెళ్లిన బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. బాధితురాలు ఫిర్యాదు చేశారని, పరారైన కామాంధుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications