చేతబడి చేశారు: ఆరు నెలల పాటు మహిళపై రేప్
అహ్మదాబాద్: ఇద్దరు సోదరులు తనపై అత్యాచారం చేశారని 32 ఏళ్ల వివాహిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మోసగించి సుదర్శన్ భూవాజీ, కనియా భూవాజి అనే ఇద్దరు సోదరులు ఆరు నెలల పాటు తనపై అత్యాచారం చేశారని ఆ మహిళ ఫిర్యాదు చేసింది.
నిందితులు నిరుడు అక్టోబర్‌లో తనకు చేతబడి చేశారని, నిరుడు అక్టోబర్, ఈ ఏడాది మే 20 మధ్య పలుమార్లు ఇంటికి పిలిచి, తనపై అత్యాచారం చేశారని ఆరోపించింది. వారిద్దరు తన సోదరులని, వారు తమ సోదరి బేబీ సహాయం తీసుకున్నారని ఆమె చెప్పింది.

తాను వారి ఆదేశాలను కాదనలేకపోయానని, తన డబ్బులు, రెండు లక్షల రూపాయల విలువ చేసే ఆభరణాలు వారికి ఇచ్చేశానని చెప్పింది. మహిళను వారిద్దరు మోసం చేశారనే దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు.
తమతో శారీరక సంబంధం పెట్టుకుంటే ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని వారు మహిళను నమ్మించినట్లు చెప్పారు. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తలదాచుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications