ఐదుగంటల్లో 3సార్లు గ్యాంగ్‌రేప్: మహిళ ఫిర్యాదు

సూరత్: గుజరాత్ రాష్ట్రంలోని అమ్రోలిలో దారుణం చోటు చేసుకుంది. ఓ 24ఏళ్ల మహిళపై ఆరుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఐదుగంటల్లో మూడుసార్లు ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టారు. నవంబర్ 18, 19 తేదీల్లో నిందితులు మహిళపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.స

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. సోనూ సింగ్, సందీప్, మహేష్ జాడియా, నితిన్ అలియాస్ పప్పు, మరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

బాధితురాలు పిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో అద్దె గది కోసం వెతుకుతుంటే సోనూ సింగ్ తనకు సహాయం చేశాడని బాధితురాలు తెలిపింది. కొద్ది రోజుల క్రితం మరో అద్దె గది కోసం ఆమె అతడ్ని మళ్లీ కలిసింది. అతని ఇంటి వద్ద ఆమె కొనుగోలు చేసిన బూట్లు మరిచిపోయి తిరిగి తన ఇంటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత మళ్లీ తన బూట్లను తిరిగి తెచ్చుకునేందుకు నవంబర్ 18 సాయంత్రం కోసద్‌లోని అతని ఇంటికి వెళ్లింది.

Woman accuses six of raping her thrice in five hours in Surat

రాత్రి 9గంటల ప్రాతంలో బూట్లను తీసుకుని తిరిగి ఓ ఆటో రిక్షాలో తన ఇంటికి వెళుతుండగా మార్గమధ్యలో బైకుపై వచ్చిన సోనూ సింగ్, సందీప్, మహేష్ జాడియా ఆమెను అడ్డగించారు. ఆమెను సమీపంలోని పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత కొంతదూరం తీసుకెళ్లి మరో పొలంలో సింగ్, సందీప్‌లు మరోసారి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతరం ఆమెను సోనూసింగ్ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై మూడోసారి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఐదుగంటల్లో ఆరుగురు వ్యక్తులు ఆమెపై మూడుసార్లు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. నవంబర్ 19న ఉదయం 4గంటల సమయంలో నిందితుల నుంచి తప్పించుకున్న బాధితురాలు అమ్రోలి పోలీస్ ష్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించామని, నివేదిక వచ్చిన తర్వాత వివరాలు తెలుస్తాయని అమ్రోలి ఇన్‌స్పెక్టర్ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+