'ప్రాణం పోతున్నా వదల్లేదు కదరా'.. కదులుతున్న అంబులెన్స్ లో యువతిపై గ్యాంగ్ రేప్
ఓ వైపు స్పృహా కోల్పోయి ప్రాణాలతో కొట్టామిట్టాడుతున్న ఆ యువతిని కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ మృగాలు చుట్టుముట్టాయి. ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని కదులుతున్న అంబెలెన్స్ లోనే తమ కామ వాంఛ తీర్చుకున్నారు. సభ్య సమాజం తల దించుకునే ఇలాంటి ఘటన బిహార్ లో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఘటన జులై 24 జరిగింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మృగాల కంటే ఘోరంగా వ్యవహరించారు వాళ్లు. అయ్యో పాపం అని ఆస్పత్రికి తీసుకెళ్లాల్సింది పోయి కదులుతున్న అంబులెన్స్ లోనే తమ కామ వాంఛ తీర్చుకున్నారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. 26 ఏళ్ల యువతి బిహార్ లోని గయాలో జిల్లాలోని బిహార్ మిలిటరీ పోలీస్ గ్రౌండ్ లో నిర్వహించిన హోమ్ గార్డ్ రిక్రూట్ మెంట్ పరీక్షకు హాజరైంది. అయితే అధికారులు ఆమెకు ఫిజికల్ టెస్టు నిర్వహిస్తుండగా ఆ యువతి కళ్లు తిరిగి కింద పడిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అంబులెన్సును ఏర్పాటు చేశారు. అప్పటికే స్పృహ కోల్పోయిన ఆమెను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.
Woman who fell unconscious at Bihar Home Guard recruitment drive ‘raped’ inside ambulance by driver and technician https://t.co/etbImCqilO
— The Indian Express (@IndianExpress) July 26, 2025
అయితే మార్గమధ్యలో తనను పలువురు వ్యక్తులు పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఆ బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తాను స్పృహ కోల్పోయి ఉండగా కదులుతున్న అంబులెన్సులోనే తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదులో తెలిపింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న బోద్ గయా పోలీస్ స్టేషన్ అధికారులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనను పూర్తిగా ఛేదించేందుకు సిట్ బృందాన్ని ఫోరెన్సిక్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు అనుమానితులు అంబులెన్సు డ్రైవర్ వినయ్ కుమార్, టెక్నీషియన్ అజిత్ కుమార్ లను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా వాళ్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అంబులెన్సులో తనకు స్పృహ లేదు కానీ.. ఏం జరుగుతుందో కొంచెం కొంచెం అవగాహన ఉన్నట్లు పేర్కొంది. ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు తనను రేప్ చేసినట్లు తెలిపింది. ఈ మేరకు కేసును త్వరగా ఛేదించి బాధితురాలికి న్యాయం చేయాలని లోక్ జనశక్తి పార్టీ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications