ఇంట్లోకి చొరబడి ఆంధ్ర మహిళపై రేప్: పక్కింటి కామాంధుడి అరెస్టు

బెంగళూరు: ఇంటిలో ఒంటరిగా ఉన్న మహిళ మీద పక్కింటి వ్యక్తి అత్యాచారం చేసిన సంఘటన బెంగళూరు నగరంలోని యలహంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. యలహంకలోని కామాక్షమ్మ లేఔట్ లో నివాసం ఉంటున్న చంద్రశేఖర్ రెడ్డి (31) అనే కామాంధుడిని అరెస్టు చేశామని గురువారం పోలీసులు చెప్పారు.

యలహంకలోని కామాక్షమ్మ లేఔట్ లో చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన ప్రవాసాంధ్రులు వేల సంఖ్యలో నివాసం ఉంటున్నారు. వీరు చేనేత కార్మికులుగా పని చేస్తున్నారు. చాల మంది సొంతంగా మగ్గాలు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు. బుధవారం రాత్రి చంద్రశేఖర్ రెడ్డి పక్కింటిలో నివాసం ఉంటున్న 25 సంవత్సరాల మహిళకు, వారి పక్కింటి వారితో గొడవ జరిగింది.

Woman allegedly raped in Bangalore

తరువాత చుట్టు పక్కల వారు ఇరు వర్గాల వారికి సర్ది చెప్పారు. గొడవ నిలిచిపోయిన తరువాత ఎవరి ఇండ్లలోకి వారు వెళ్లారు. ఆ సమయంలో మహిళ భర్త పక్కింటి వాళ్లు మళ్లీ వచ్చి గొడవ చేస్తారని భయపడ్డాడు. కుమారుడిని పిలుచుకుని భార్యను అక్కడే వదిలి అతను అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న బంధువుల ఇంటి దగ్గరకు వెళ్లిపోయాడు.

ఆ సమయంలో మహిళ ఒక్కరే ఇంటిలో ఉన్నారు. విషయం గుర్తించిన చంద్రశేఖర్ రెడ్డి అర్దరాత్రి మహిళ ఇంటిలోకి చొబరడి అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గురువారం పోలీసులు బాధితురాలిని , చంద్రశేఖర్ ను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసు దర్యాప్తులో ఉందని యలహంక పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+