గదిలో నిర్బంధించి మహిళపై 11 నెలలు అత్యాచారం

కోర్టు ఆదేశాల మేరకు నిందితుడపై పోలీసులు సోమవారంనాడు కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులపై వివిధ సెక్షల కింద కేసులతో పాటు అత్యాచారం కింద కూడా కేసు నమోదు చేశారు. ఆ ఇద్దరు కూడా కార్మికులు. వారు సవాయ్‌మధోపూర్ జిల్లా బమన్వాస్‌కు చెందినవారు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నారని, వారిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు చెప్పారు.
ఇదిలావుంటే, తనకు పెళ్లయిన రెండు రోజులకే తన మామ తనపై అత్యాచారం చేశాడని కొత్తగా పెళ్లియిన సంగనేర్‌కు చెందిన 19 ఏళ్ల అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన ఫిబ్రవరి 10వ తేదీన చోటు చేసుకుంది. సోమవారంనాడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
వరకట్నం కోసం తన అత్తవారింట్లో శారీరకంగా, మానసికంగా హింసించారని ఆ అమ్మాయి ఫిర్యాదు చేసింది. భర్తతో పాటు పది మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.












Click it and Unblock the Notifications