రెండో పెళ్లి: తల్లి కుమార్తె కలిసి ఏం చేశారంటే ?

శ్రీనగర్: మోసం చేసి వేరే పెళ్లి చేసుకున్నాడని కోపంతో భార్య తన కుమార్తె, మరో ఇద్దరితో కలిసి భర్త మీద యాసిడ్ దాడి చేసిన ఘటన జమ్ము కాశ్మీర్ లో జరిగింది. తీవ్రగాయాలైన బాధితుడు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.

జమ్మూ కాశ్మీర్ లోని కతువా జిల్లాలోని బాని పట్టణంలో మహమ్మద్ డిన్, షమీమా అక్తర్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కుమార్తె ఉంది. మహమ్మద్ డిన్ అనే కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను పదేళ్ల క్రితం షమీమా అక్తర్ ను వివాహం చేసుకున్నాడు.

అయితే షమీమా అక్తర్ కు తెలియకుండా ఇతను ఇటీవల వేరే మహిళను వివాహం చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా కాపురం చేస్తున్నాడు. మహమ్మద్ డిన్ సరిగా ఇంటికి రావడం లేదని తెలుసుకున్న షమీమా అక్తర్ భర్త మీద నిఘా వేసింది.

Woman allegedly throws acide on husband in Jammu

మహమ్మద్ డిన్ రెండో భార్య ఇంటికి వెలుతున్న సమయంలో అతన్ని పట్టుకుని గొడవ పెట్టుకుంది. తరువాత షమీమా అక్తర్ తన కుమార్తె, మరో ఇద్దరితో కలిసి భర్త అహమ్మద్ డీన్ ముఖం మీద యాసిడ్ పోసింది.

తీవ్రగాయాలైన మహమ్మద్ డిన్ ను ఆసుపత్రికి తరలించారు. మహమ్మద్ డిన్ పరిస్థితి విషమంగా ఉందని, అతను మృత్యువుతో పోరాడుతున్నాడని పోలీసులు చెప్పారు. షమీమా అక్తర్ తో పాటు ఆమె కుమార్తె, యాసిడ్ దాడి చెయ్యడానికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+