• search

అశ్లీల వీడియో తీసి నటిని బ్లాక్ మెయిల్ చేస్తున్న ప్రముఖ నటుడు, రూ. లక్షలు స్వాహా!

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
      జ్యూస్ లో మత్తు మందు కలిపి అశ్లీల వీడియో తీసి నటిని బ్లాక్ మెయిల్

      బెంగళూరు: స్యాండిల్ వుడ్ (కన్నడ చిత్ర పరిశ్రమ)లో ప్రముఖ నటుడు, విలన్, పోలీసు పాత్రల్లో నటిస్తున్న ధర్మా మీద సినీనటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అశ్లీల వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ తన దగ్గర ఇప్పటి వరకు రూ. 15 లక్షలు తీసుకుని మళ్లీ వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు.

      షూటింగ్ ఉంది రండి !

      షూటింగ్ ఉంది రండి !

      మూడు నెలల క్రితం ప్రముఖ నటుడు ధర్మా అతని కారు డ్రైవర్ నవీన్ తో కన్నడ నటి (35)కి ఫోన్ చేపించాడని సమాచారం. ఆర్ఆర్ నగర్ లో షూటింగ్ ఉందని రావాలని సమాచారం ఇచ్చారు. తరువాత ఆమె ఆర్ఆర్ నగర్ కు వెళ్లింది. ఆ సందర్బంలో షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందని ఆమెకు ధర్మా, నవీన్ చెప్పారని తెలిసింది.

      జ్యూస్ లో మత్తు మందు

      జ్యూస్ లో మత్తు మందు

      ధర్మా, అతని కారు డ్రైవర్ నవీన్ కలిసి నటిని హోటల్ కు తీసుకెళ్లి భోజనం చేశారు. అనంతరం జ్యూస్ లో మత్తు మందు కలిపి తనకు ఇచ్చారని, అనంతరం అశ్లీల వీడియో తీసి తనను బ్లాక్ మెయిల్ చేసి రూ. 15 లక్షలు వసూలు చేశారని బాధితురాలు ఆరోపిస్తున్నారు.

      జీవితం నాశనం చేస్తాం !

      జీవితం నాశనం చేస్తాం !

      అశ్లీల వీడియో మీ కుటుంబ సభ్యులకు పంపిస్తామని, నీ జీవితం నాశనం అవుతుందని నటుడు ధర్మా, అతని కారు డ్రైవర్ నవీన్ బెదిరించి ఇప్పటి వరకూ రూ. 15 లక్షలు వసూలు చేశారని, ఇంకా డబ్బు ఇవ్వాలని పీడిస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు.

      భర్తకు చెప్పిన నటి !

      భర్తకు చెప్పిన నటి !

      ప్రముఖ నటుడు ధర్మా, అతని కారు డ్రైవర్ నవీన్ వేధింపులు భరించలేని నటి జరిగిన విషయం మొత్తం ఆమె భర్తకు చెప్పింది. తరువాత బాధితురాలు, ఆమె భర్త జూన్ 6వ తేదీన నటుడు ధర్మా, కారు డ్రైవర్ నవీన్ మీద బేగూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

      పోలీసుల మాయమాటలు !

      పోలీసుల మాయమాటలు !

      బేగూరు పోలీసులు మాత్రం ఇప్పటి వరకూ నటుడు ధర్మా, నవీన్ ను అరెస్టు చెయ్యలేదని బాధితురాలు ఆరోపిస్తున్నారు. నటుడు ధర్మా, కారు డ్రైవర్ తప్పించుకుని తిరుగుతున్నారని పోలీసులు మాయమాటలు చెబుతున్నారని, వారిని అరెస్టు చెయ్యలేదని, పోలీసులు తనకు అన్యాయం చేస్తున్నారని బాధితురాలు ఆరోపణలు చేస్తున్నారు.

      తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

      English summary
      A complaint has been lodged against a Kannada film actor Dharma at Begur police station. woman alleges of blackmail from actor dharma.

      Oneindia బ్రేకింగ్ న్యూస్
      రోజంతా తాజా వార్తలను పొందండి

      X
      We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more