కారులో ఎత్తుకెళ్లి మహిళపై ఆరుగురు లైంగిక దాడి

కారులో తనను నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, కారు వేగం తగ్గగానే కిందికి దూకేసి తాను పారిపోయి వచ్చినట్లు మహిళ చెప్పింది.
వారు తనను వెంటాడారని, ఆ సమయంలో తాను గాయపడ్డానని మహిళ చెప్పింది. మహిళను ఆస్పత్రిలో చేరారు. ఆమె ప్రాణాలకు ఎటువంటి ప్రమాదమూ లేదని పోలీసులు చెప్పారు.
నిందితులపై అపహరణ, అత్యాచారం, హత్యాయత్నం, దోపిడీ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications